వాట్సాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి రుసుము వసూలు చేయమని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. వాట్సాప్‌లో శుక్రవారం నుంచి పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.
వాట్సాప్‌లో యూపీఐ సేవలకు భారత జాతీయ లావాదేవీల సంస్థ (ఎన్పీసీఐ) అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు మార్క్. ఆర్థిక సేవలకు సంబంధించి వాట్సాప్‌నకు 140కిపైగా బ్యాంకులు సహకారాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.