తెలంగాణ

telangana

ETV Bharat / business

'బ్యాంకులు బౌన్సర్లను నియమించుకోలేవు' - లోక్ సభ

బ్యాంకు రుణాల వసూల కోసం బౌన్సర్లను నియమించుకునే అధికారం ఏ బ్యాంకుకూ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​ స్పష్టంచేశారు. రికవరీ ఏజెంట్ల నియామకంపై ఆర్బీఐ విధించిన నిబంధనలను లోక్ సభలో ఆయన గుర్తు చేశారు.

అనురాగ్ సింగ్ ఠాకూర్

By

Published : Jul 1, 2019, 3:20 PM IST

దేశంలో ఉన్న ఏ బ్యాంకుకు... రుణాలు వసూలు చేసేందుకు బౌన్సర్లను నియమించుకునే అధికారాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ సింగ్ ఠాకూర్ లోక్ సభలో స్పష్టం చేశారు​.

బ్యాంకు లోన్ల రికవరీ ఏజెంట్​ను నియమించుకునేందుకు ఉన్న నిబంధనలను ఈ సందర్భంగా గుర్తు చేశారాయన.

లోక్ సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి

"రికవరీ ఏజెంటును నియమించుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన నిబంధనలు విధించింది. అభ్యర్థులకు పోలీసు ధ్రువీకరణ తప్పవిసరి. 100 గంటల శిక్షణ కూడా ఉంటుంది. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ దీన్ని నిర్వహిస్తుంది. వీటితో పాటు బ్యాంకులు నిర్వహించే పరీక్షలో పాసవ్వడం తప్పని సరి."
--- అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి

రికవరీ ఏజెంట్​గా తీసుకునే అభ్యర్థులకు ప్రత్యేక ప్రవర్తన నియమావళిని బ్యాంకులకు ఆర్బీఐ సూచించిందని ఠాకూర్ చెప్పారు. వినియోగదారునితో అభ్యర్థి మాట్లాడే తీరు ఆమోదయోగ్యంగా ఉంటేనే ఏజెంటుగా నియమించుకోవాలని.. దురుసు ప్రవర్తన ఉన్న వ్యక్తులను వసూళ్లకోసం నియమించుకోవద్దని ఆర్బీఐ స్పష్టం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కేంద్ర బడ్జెట్​లో వేతన జీవులకు ఊరట!

ABOUT THE AUTHOR

...view details