ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రానా కపూర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబయి న్యాయస్థానం. ఆదివారం సెలవు దినాన ప్రత్యేకంగా సమావేశమైన కోర్టు 11వ తేదీవరకు ఆయనను కస్టడీలో ఉంచేందుకు అనుమతించింది.
ఎస్ బ్యాంకు సంక్షోభంలో కీలక పాత్రధారి అయిన రానా కపూర్ ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు చేసింది ఈడీ. 20 గంటల పాటు ఆయనను విచారించింది. అనంతరం ఆయనను ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేసింది. ఆ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టింది. మరింత విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించింది. ఈడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది ముంబయి కోర్టు.