తెలంగాణ

telangana

ETV Bharat / business

'పండుగ వచ్చాక ఆర్థిక మందగమనం పరార్​'

ఆర్థిక మందగమనాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని కరూర్ వైశ్యాబ్యాంక్​ ఎండీ, సీఈఓ పి.ఆర్​ శేషాద్రి అన్నారు. ప్రస్తుతం కాస్త మందగమనం ఉన్నా.. త్వరలో పండుగ సీజన్ మొదలై వృద్ధి పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

By

Published : Aug 23, 2019, 1:51 PM IST

Updated : Sep 27, 2019, 11:51 PM IST

ఆర్థిక వృద్ధి మందగమనం

ప్రైవేట్​ దిగ్గజం కరూర్​ వైశ్యా బ్యాంకు తమ వినియోగదారులకు బీమా సేవలు అందించేందుకు డిజిట్ ఇన్సూరెన్స్​ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వివరాలు సహా ఆర్థిక, మందగమనం వంటి అంశాలను ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా పంచుకున్నారు ఆ బ్యాంకు ఎండీ​, సీఈఓ పీఆర్​ శేషాద్రి.

ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్థిక మందగమనాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని.. అయితే అది సాధారణంగా వచ్చే వృద్ధి మందగమనమేనంటున్నారు శేషాద్రి.

కరూర్ వైశ్యాబ్యాంక్​ ఎండీ, సీఈఓ పి.ఆర్​ శేషాద్రి ఇంటర్వ్యూ

"మేము డిజిట్​ ఇన్సూరెన్స్​తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీని ద్వారా వారి బీమా ఉత్పత్తులన్నీ మా వినియోగదారులకు అందిస్తాము. డిజిట్​ అనేది టెక్నాలజీ అధారంగా పని చేస్తున్న బీమా సంస్థ. డిజిట్ బీమాతో కలిసి పని చేయడం ద్వారా వారి బీమా ఉత్పత్తులన్నీ మా వినియోగదారులకు అందుతాయని ఆశిస్తున్నాం.
మాలో చాలమంది దగ్గర ఆర్థిక వృద్ధి మందగమనం ఏ స్థాయిలో ఉందనే సమాచారం లేదు. ఇంత మొత్తంలో క్షీణత ఉందని పలు సంస్థలు అంటున్నాయి. కొన్ని రంగాల్లో మందగమనం ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్​ నుంచి దాదాపు సెప్టెంబర్​ వరకు మందగమనం ఉంటుంది. ఇప్పుడు అందులో పీక్ సీజన్ నడుస్తోంది. దీనికి సంబంధించి.. తమ దగ్గరున్న నిజమైన సమాచారం కన్నా ఎక్కువగా మీడియా ప్రచారం చేస్తోంది. అయితే త్వరలో పండుగ సీజన మొదలవుతుంది. ఫలితంగా త్వరలో అర్థిక వృద్ధి పుంజుకుంటుందని ఆశిస్తున్నాం."
- పీఆర్​ శేషాద్రి, కరూర్​వైశ్యా బ్యాంకు ఎండీ

ఇదీ చూడండి: మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్​ రయ్​

Last Updated : Sep 27, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details