తెలంగాణ

telangana

ETV Bharat / business

మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్​ రయ్​

స్పోర్ట్స్​ కార్లు, లగ్జరీ కార్లు అనగానే.. పొట్టిగా నేలను తాకుతున్నట్లు ఉండి వేగంగా దూసుకెళ్లే కార్లు గుర్తొస్తాయి. సినిమాల్లో, రేసింగ్​ కోర్సుల్లో కనిపించేవిగా మనకు సుపరిచితం. సాధారణ రోడ్లపై వీటిని చూడటం అరుదు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. వీటితో పాటు లగ్జరీ కార్లూ సంఖ్యాపరంగా నానాటికీ దూసుకెళ్తున్నాయి. మరి మన నగరంలో ఈ కార్ల లభ్యత, ధరల వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్​ రయ్​

By

Published : Aug 23, 2019, 6:32 AM IST

Updated : Sep 27, 2019, 11:03 PM IST

మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్​ రయ్​

హైదరాబాద్​లో స్పోర్ట్స్‌, లగ్జరీ కార్ల వినియోగం ప్రతిఏటా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో 150 నుంచి 200 మోడళ్ల వరకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్​లో స్పోర్ట్స్ కార్లు విక్రయిస్తున్న సంస్థల ప్రకారం.. స్పోర్ట్స్​, లగ్జరీ కార్ల విభాగానికొస్తే.. ఈ సంఖ్య 2,000లకు పైమాటేనని తెలుస్తోంది. ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ కార్లపై ఆసక్తి చూపే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి.

లగ్జరీ కార్ల ధరలు తెలిస్తే అవాక్కే..

కనీస ఇంజిన్‌ సామర్థ్యం 2000 సీసీగా ఉండే స్పోర్ట్స్ కార్లకు ప్రారంభ ధర రూ.1.4 కోట్లుగా ఉంది. అదే పాత కార్లు అయితే రూ.కోటిలోపే నగరంలో అందుబాటులో ఉన్నాయి. అన్ని తనిఖీలు చేసి ధ్రువీకరణతో వీటిని అందించేందుకు ప్రత్యేకించి నగరంలో పలు షోరూంలు అందుబాటులో ఉన్నాయి.

రెండు విభాగాల్లో టాప్​ బ్రాండ్లు ఇవే..

స్పోర్ట్స్​ కార్ల విభాగంలో లాంబోర్గినీ, ఫెరారీ, యాస్ట్రన్‌ మార్టిన్‌, ఫోర్షే లాంటివి ప్రధానంగా ఉన్నాయి. బెంట్లీ, రోల్స్‌ రాయిస్‌, లెక్సస్‌, రేంజ్‌ రోవర్‌, మినీ కూపర్‌లు లగ్జరీ కార్లకు ప్రత్యేకించిన బ్రాండ్లు. బీఎండబ్లూ, ఆడీలో కొన్ని మోడళ్లు లగ్జరీ విభాగంలో ఉన్నాయి. ఇవన్నీనగరంలోనే కొనుగోలు చేసే వీలుంది. అయితే బుగాట్టీ లాంటి కార్లను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

"ఫెరారీ, లాంబోర్గిని స్పోర్ట్స్​ కార్లు జనాలు ఎక్కువగా ఇష్టపడే ఆల్​ టైం ఫేవరెట్​ కార్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రియల్​ ఎస్టేట్ వ్యాపారులు.. అందరూ కార్లు కొనేందుకు వస్తుంటారు. స్పోర్ట్స్​ విభాగంలో నెలకు కనీసం రెండు కార్లు అమ్ముడవుతుంటాయి." - ముకల్​ కపూర్, సీఎల్‌5 ఆటోమోటీవ్స్‌ సీఈఓ

వారాంతంలో రోడ్లపైకి...

భారత్‌లో వాతావరణం, రోడ్ల పరిస్థితి దృష్ట్యా ఎస్‌యూవీ మోడళ్లు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. స్పోర్ట్స్‌ వాహనాలకు తగ్గ రోడ్లు లేనందున దిల్లీ, చెన్నై లాంటి నగరాల్లో ఉన్న ట్రాక్‌లను వినియోగదారులు బుక్‌ చేసుకుంటున్నారు. వారాంతంలో ఎక్కువగా స్పోర్ట్స్​ కార్లు వినియోగించేందుకు కార్ల ప్రియులు ఇష్టపడుతున్నారు.

Last Updated : Sep 27, 2019, 11:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details