తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ యంత్రంతో మీ ఇంట్లోనే కూరగాయలు పండించొచ్చు!

ఇంతవరకు మార్కెట్లో లేని సరికొత్త గృహోపకరణాన్ని తెచ్చేందుకు ఎల్​జీ సిద్ధమైంది. ఈ యంత్రంతో ఇంట్లోనే కూరగాయలు పండించే వీలు కలగనుందని ఎల్​జీ వెల్లడించింది. మీరు చదివింది నిజమే.. ఇంతకీ ఇంట్లో కూరగాయలు ఎలా పండించ వచ్చో చూద్దామా?

LG
ఎల్​జీ

By

Published : Dec 28, 2019, 7:01 AM IST

'ఎల్​జీ' ఈ సంస్థ పేరు వింటే చాలా మందికి.. టీవీలు, స్మార్ట్​ ఫోన్లు, గృహోపకరణాలు తయారు చేసే సంస్థ గుర్తొస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త సాంకేతికతతో గృహోపకరణాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బట్టలు ఉతికేందుకు, ఆహార పదార్థాలను తాజాగా ఉంచేందుకు ఉపకరణాలను కలిగి ఉన్న ఎల్​జీ తాజాగా... ఇంట్లోనే కూరగాయలు పండించుకునేందుకు వీలుగా ఓ ఉపకరణాన్ని రూపొందిస్తోంది. 2020లో జరగనున్న 'కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో'లో ఈ కొత్త గృహోపకరణాన్ని ప్రదర్శించనుంది ఎల్​జీ.

ఈ కొత్త ఉత్పత్తికి ఏం పేరుపెట్టారనే విషయం వెల్లడించలేదు ఎల్​జీ. అయితే ఈ కొత్త డివైజ్​ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండనున్నాయనే విషయాన్ని లీక్ చేసింది.

కొత్త పరికరం వెల్లడించనందున ప్రస్తుతానికి ఎల్​జీ 'వెజ్జీ' అనే పేరుతో పిలుస్తున్నట్లు ఎల్​జీ వర్గాలు వెల్లడించాయి. వారి ప్రకారం.. రానురాను పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వెజ్జీలో కూరగాయలు పండించేందుకు సరిపోయే మాడ్యులార్​ విధానం ఉంటుంది. కూరగాయలు పండించేందుకు బయట వాతావరణ పరిస్థితులను ప్రతిబింబించేలా ఇన్సులేటెడ్​ క్యాబిన్​ ఉండనుంది. విత్తనాలు మొలకెత్తేందుకు ఎల్​జీ వెజ్జీలో ఎల్​ఈడీ లైట్లు, బలవంతంగా గాలి ప్రసరణ విక్​ ఆధారిత నీటిసరఫరా వ్యవస్థలు ఉండనున్నాయి. వీటి ద్వారా కావాల్సిన కూరగాయలను ఇంట్లోనే పండించుకనే వీలుకలగనుంది.

ఇదీ చూడండి:రివ్యూ 2019: ఏడాదిలో ఇంత డేటా వాడేశామా!

ABOUT THE AUTHOR

...view details