భవిష్యత్ తరం సాంకేతికతల అభివృద్ధికి, దేశంలో డిజిటల్ పరివర్తనకు.. సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో జతకడుతున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. వీడియో సందేశంలో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల.. జియోతో ధీర్ఘకాలిక భాగస్వామ్యం ఉంటుందని స్పష్టంచేశారు.
జియో కోసం మైక్రోసాఫ్ట్‌తో జతకట్టిన అంబానీ - డిజిటల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్‌పై ఎన్నో సంచలన ప్రకటనలు చేశారు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో డిజిటల్ పరివర్తన తీసుకురావడం కోసం సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో జియో జతకడుతున్నట్లు తెలిపారు.
"జియో, మైక్రోసాఫ్ట్ కలిసి భారత్‌లో కొత్త క్లౌడ్ డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. తమ సొంత డిజిటల్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు జియో వినియోగదారులు ఈ టూల్స్‌ను, వేదికలను తమ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. జియో, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ఆఫీస్ 365ను ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి మరిన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఆధునికమైన పని ప్రపంచాన్ని కల్పించవచ్చు. జియో, మైక్రోసాఫ్ట్ కలిసి మరిన్ని డివైస్‌లలో కృత్రిమ మేథస్సుకు సంబంధించిన ఆజుర్ కాగ్నిటివ్ సర్వీసును ప్రధాన భారతీయ భాషల్లో అందిస్తాయి."
- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో