స్మార్ట్‌ఫోన్ యూజర్లకు.. 'నావిక్' సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)కు ప్రత్యామ్నాయంగా భారత్ సొంత పరిజ్ఞానంతో తీసుకువచ్చిన నావిగేషన్ సాంకేతికతే ఈ 'నావిక్'.
షియోమీతో చర్చలు..
'నావిక్'ను స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి తెచ్చేందుకు గానూ.. ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీతో ఇస్రో చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. భారత్‌లో విక్రయించే షియోమీ స్మార్ట్ఫోన్లలో.. 'నావిక్'ను సపోర్ట్ చేసే.. చిప్‌సెట్‌ను వినియోగించే విషయంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.
భవిష్యత్ స్మార్ట్ఫోన్లకు నావిక్‌తో పని చేసే 'క్వాల్కామ్' చిప్సెట్లను తయారు చేస్తోంది షియోమీ. ఈ చిప్సెట్లను త్వరలోనే విడుదల చేసే అవకాశముంది.