ఒరాకిల్‌తో కాపీరైట్ కేసులో గూగుల్‌కు ఊరట లభించింది. 'ఆండ్రాయిడ్' ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కోడ్ విషయంలో ఇరు సంస్థల మధ్య తలెత్తిన వివాదంలో అమెరికా సుప్రీం కోర్టు గూగుల్ వైపు నిలిచింది.
ఆండ్రాయిడ్ కోసం తమ కోడ్ కాపీ కొట్టినట్లు ఒరాకిల్ చేసిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ వివాదంలో న్యాయమూర్తులు 6- 2 నిష్పత్తిలో గూగుల్‌కు అనుకూలంగా నిలిచారు. గూగుల్ ఆ కోడ్‌ను సహేతుక ప్రయోజనం కోసం వినియోగించిందని.. అందువల్ల ఈ చర్య కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పలేమని న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ అభిప్రాయపడ్డారు.
వివాదం ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి గూగుల్, ఒరాకిల్ మధ్య గత పదేళ్లుగా వివాదం కొనసాగుతోంది.
2007లో విడుదలైన ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం మిలియన్ల కోడింగ్ లైన్లను రాసింది గూగుల్. అయితే అందులో 11,330 లైన్ల కోడింగ్‌ను తమకు చెందిన జావా ప్లాట్‌ఫామ్ నుంచి తీసుకున్నట్లు ఒరాకిల్ ఆరోపించింది. తమ కోడింగ్‌ను.. చట్టవిరుద్ధంగా వినియోగించుకుందని గూగుల్‌పై 8 బిలియన్ డాలర్ల దావా వేసింది.
అయితే ఇది టెక్ పరిశ్రమలో సాధారణంగా జరుగుతున్న ప్రక్రియేనని, ఉత్తమ సాంకేతకతను రూపొందించేందుకు ఇది మంచిదేనని గూగుల్ తన చర్యను సమర్థించుకుంది.
ఇదీ చదవండి:హెచ్డీ సెట్-టాప్ బాక్స్‌లపై టాటా స్కై ఆఫర్ల మేళ!