తెలంగాణ

telangana

ETV Bharat / business

కేబుల్​ టీవీ కస్టమర్లకు శుభవార్త- ఇక రూ.130కే 150 ఛానళ్లు!

డీటీహెచ్ సంస్థలకు పోటీగా కేబుల్ టీవీ ఆపరేటర్లు డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. 'ట్రాయ్'​ ఇచ్చిన మినహాయింపులు వారికి కలిసొచ్చే అంశం. మరి కేబుల్​ టీవీ, డీటీహెచ్... రెండింటిలో దేనిద్వారా మీకు ఎక్కువ డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి.

కేబుల్ టీవీ

By

Published : Oct 7, 2019, 5:19 AM IST

అన్ని రంగాల్లానే డీటీహెచ్​, కేబుల్​ టీవీ పరిశ్రమలో పోటీ సాధారణం. టెలికాం నియంత్రణ సంస్థ "ట్రాయ్​" తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో ఈ పోటీ మరింత పెరిగిందని చెప్పాలి. ట్రాయ్​ చేసిన మార్పులతో వినియోగదారులపై ఛార్జీల భారమూ పెరిగిందనేది చాలా మంది వాదన. కొంతమంది వినియోగదారులు ఛార్జీలు తగ్గించమని ట్రాయ్​ కోరారు. కేబుల్ టీవీ అపరేటర్లూ ఛార్జీల విషయంపై చేసిన విజ్ఞప్తి మేరకు ట్రాయ్ దిగొచ్చింది.

ఛార్జీలు తగ్గించడం సహా వినియోగదారులకు మేలు చేసే విధంగా అడుగులు వేసింది ట్రాయ్. ఈ సానుకూలతలన్నింటితో కేబుల్​ టీవీ ఆపరేటర్లు.. సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టారు. వీటితో భారీగా వినియోగదారులను ఆకర్షించాలని చూస్తున్నారు.

కేబుల్​ టీవీ ఆపరేటర్ల ఆఫర్లు ఇవే..

కేబుల్ టీవీ ఆపరేటర్లు... నెట్​వర్క్ కెపాసిటీ పెంచడం సహా నెలవారీ చందాల్లో డిస్కౌంట్లను అందిస్తున్నారు. అదెలా అంటే కేబుల్​ టీవీ నెట్​వర్క్​ను వాడే వినియోగదారులు టీవీ ఛానళ్ల కోసం కనీసం రూ.130 ఎన్​సీఎఫ్​ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ ఛార్జీలు చెల్లించే వారికి కేబుల్​ టీవీ ఆపరేటర్లు 100 ఛానళ్లను అందిస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కొత్త నిబంధనలతో తలెత్తిన అనిశ్చితులను తొలగించేందుకు పలు కేబుల్​ సంస్థలతో సంప్రదింపులు జరిపింది ట్రాయ్​. ఇందులో అఖిల భారత డిజిటల్​ కేబుల్​ సమాఖ్య కొన్ని కీలక సూచలు చేసింది. ప్రధానంగా ఎన్​సీఎఫ్ ఛార్జీల మోత తగ్గిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేబుల్ టీవీల ఆపరేటర్లకు రూ.130ల కనీస ఛార్జీలకే.. 150 ఛానళ్లు ప్రసారం చేసే వీలు కల్పించింది.

ఎన్​సీఎఫ్​ ఛార్జీల కథేంటంటే...

ట్రాయ్ తొలుత​ తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం వినియోగదారులు మొదటి 100 ఛానళ్ల కోసం కచ్చితంగా రూ.130 నెట్​వర్క్​ కెపాసిటీ ఫీ కింద చెల్లించాలి. ప్రతి 25 అదనపు ఛానళ్లకు రూ.20 ఎక్కువగా చెల్లించాల్సి ఉండేది. ట్రాయ్ ఈ అదనపు ఛార్జీలను తొలగించింది. ఈ సానుకూలతలతో కేబుల్ టీవీ ఆపరేటర్లు అదనపు ఛార్జీల రద్దును వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తున్నారు. ఫలితంగా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 150 ఛానళ్లు పొందనున్నారు వినియోగదారులు. దేశంలో అధిక శాతం మంది టీవీ వీక్షకులు సగటున 150 ఛానళ్లకు మించి వినియోగించుకునే అవకాశం లేదు. ఈ కారణంగా గతంతో పోలిస్తే వారిపై ఇప్పుడు కాస్త తక్కువ భారం పడనుంది.

ఈ సమయంలో చాలా మందికి వచ్చే సందేహం ఒక్కటే.. ఛార్జీల తగ్గింపు కేబుల్ టీవీ ఆపరేటర్లకు మాత్రమేనా? డీటీహెచ్​ ఆపరేటర్లకు వర్తించదా అని. డీటీహెచ్ ఆపరేటర్లు అఖిల భారత డిజిటల్​ కేబుల్​ సమాఖ్య పరిధిలోకి రానందున ఈ మినహాయింపులు వర్తించవు. డీటీహెచ్​లో 150 ఛానళ్లు కావాలంటే రూ.130 కనీస ఎన్​సీఎఫ్​ ఛార్జీలకు అదనంగా రూ.40 ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇది కేబుల్ టీవీ ఆపరేటర్లకు కలిసొచ్చే అంశం. ఎక్కువ మంది మధ్యతరగతి వినియోగదారులు డీటీహెచ్​తో పోలిస్తే.. కేబుల్ టీవీని ఉత్తమ ఎంపికగా భావించే అవకాశముంది.
డీటీహెచ్​ ఆపరేటర్లలోనూ సన్​డైరెక్ట్​ సహా కొన్ని సంస్థలు ఎన్​సీఎఫ్​ ఛార్జీల్లో కొంత డిస్కౌంట్​ ఇస్తుండటం గమనార్హం.

ఇదీ చూడండి: మీ క్రెడిట్​కార్డ్ దరఖాస్తు తిరస్కరణకు కారణాలివే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details