తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బకు భారీగా తగ్గిన గూగుల్, ఫేస్​బుక్ ఆదాయం - కరోనాతో గూగుల్ ఫేస్​బుక్ ఆదాయాలకు గండి

కరోనా మహమ్మారి మహమ్మారి అన్ని రకాల వ్యాపారాలను తీవ్రంగా కుంగదీస్తోంది. కొవిడ్ విజృంభణ కారణంగా డిజిటల్ ప్రకటనలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో గూగుల్, ఫేస్​బుక్ వంటి సంస్థలకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాలు తొలిసారి భారీగా క్షీణించాయి. అయితే ఈ సంస్థలకు కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడం పెద్ద సమస్య కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

corona impact on digital Adds
డిజిటల్ ప్రకటనలపై కరోనా దెబ్బ

By

Published : Apr 28, 2020, 5:04 PM IST

దశాబ్దం పాటు అనూహ్య వృద్ధిలో కొనసాగిన డిజిటల్ ప్రకటనల వ్యాపారం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మందగించింది. డిజిటల్ ప్రకటనలు తగ్గడం వల్ల గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజ సంస్థల ఆదాయాలు కూడా తొలిసారి పడిపోయాయి.

వినియోగదారులు ఇంటి వద్దే ఉండడం, నిరుద్యోగం పెరగడం వల్ల ప్రమోషన్లకు సంబంధించి చాలా సంస్థలు తమ ప్రకటనలను తగ్గించేశాయి. మరికొన్ని సంస్థలు అయితే మొత్తం ప్రకటనలనే నిలిపివేశాయి.

అమెరికా డిజిటల్ ప్రకటనల విపణిలో గూగుల్, ఫేస్‌బుక్ వాటా 70 శాతంగా ఉంది. ప్రకటలు తగ్గటం వల్ల ఆ ప్రభావం ఈ సంస్థలపై కాస్త ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు డిజిటల్ యాడ్స్ సంస్థలు ఉద్యోగులను తొలగించడకుండా వేతనాల్లో కోతలు, జీతాలు లేని సెలవులు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాయి.

నియామకాలు లేవు​.. నిధుల్లో కోతలు..

ఈ సంవత్సరం నూతన నియామకాలు ఉండవని, 2020 మార్కెటింగ్‌ బడ్జెట్‌లో భారీగా కోతలు విధిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ ఇదివరకే తమ ఉద్యోగులకు తెలిపారు.

ఫేస్‌బుక్ కూడా తమ ప్రకటనల ఆదాయం బాగా తగ్గిపోయిందని వెల్లడించింది. చాలా దేశాల్లో సందేశాల ట్రాఫిక్‌ మాత్రం 50 శాతం వృద్ధి చేందగా... వాయిస్, వీడియో కాల్స్‌ కూడా బాగా పెరిగాయని పేర్కొంది. అయితే వీటి వృద్ధితో ఆదాయం రావడం లేదని ఫేస్‌బుక్ పేర్కొంది.

ఆదాయం తగ్గినా...

గడిచిన త్రైమాసికంలో ఫేస్‌బుక్, గూగుల్ ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండకపోయినా ఏప్రిల్‌-జూన్ మధ్య గణనీయంగా ఉండొచ్చని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో డిజిటల్ ప్రకటనల రంగం విలువ 125 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఇంటరాక్టివ్‌ అడ్వర్టైజింగ్ బ్యూరో చెబుతోంది. పెద్ద మొత్తంలో నిల్వలున్న గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలకు కరోనాతో వచ్చిన ఇబ్బందులు ఎదుర్కోవడం పెద్ద కష్టంకాదని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆన్​లైన్​ విక్రయాలు: ఇంటి నుంచే కార్లను కొనండి

ABOUT THE AUTHOR

...view details