తెలంగాణ

telangana

ETV Bharat / business

పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు దగ్గరపడింది! - వ్యాపార వార్తలు

పాన్​-ఆధార్ అనుసంధానానికి ఈ నెలాఖరున తుది గడువు ముగియనుంది. ఇంకా అనుసంధానం పూర్తి చేయని వారు గడువులోపే ప్రక్రియ పూర్తి చేసుకోమని ఆదాయపన్ను శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు గడువు పెంచిన నేపథ్యంలో మరో సారి గడువు పెంపు ఉండకపోవచ్చిని అంటున్నారు.

PAN AADHAAR
పాన్​ ఆధార్​ అనుసంధానం

By

Published : Dec 22, 2019, 5:20 PM IST

పాన్-ఆధార్ అనుసంధానానికి గ‌డువు దగ్గరపడుతోంది. అనుసంధాన ప్రక్రియ ఇంకా పూర్తి చేయనివారు.. వీలైనంత త్వరగా చేసుకోవడం మేలు. ఇందుకు ఈ నెల 31న తుది గడువుగా నిర్ణయించింది ఆదాయపన్ను శాఖ. ఇప్పటి వరకు 7సార్లు పాన్-ఆధార్​ అనుసంధానానికి గడువుపెంచింది. మరోసారి గడువు పెంచే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు సమాచారం.

ప‌న్ను చెల్లింపుదారులంద‌రూ వారి పాన్‌, ఆధార్‌ల‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈ నెల‌లోపు అనుసంధానించాలి.

అనుసంధానం చేయకపోతే అంతే..

ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డుల‌ను చెల్లుబాటు కాని కార్డులుగా కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల విభాగం(సీబీడీటీ) ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఆధార్‌తో అనుసంధానించడం విఫలమైతే వ్య‌క్తికి కేటాయించిన పాన్ నెంబ‌రూ చెల్ల‌దు.

ఫైనాన్స్ బిల్లు ప్ర‌కారం ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డులు మ‌నుగ‌డ‌లోనివిగా గుర్తిస్తారు. ఇటువంటి కార్డుల‌ను భ‌విష్య‌త్తులో పున‌రుద్ధ‌రించ‌ుకునేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అనుమ‌తిస్తుంద‌న్న స్ప‌ష్ట‌త లేదు. అందువ‌ల్ల రిస్క్ తీసుకోకుండా గ‌డువు తేది లోపు అనుసంధానించ‌డం మంచింది.

ఈ ప్రక్రియ పూర్తయితే.. పాన్ అవసరమైనచోట ఆధార్​ను ఉపయోగించే వెసులుబాటు కలగనుంది.

ఇది ప్రక్రియ..

  • ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్ లేదా ఎస్ఎంఎస్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
  • incometaxindiaefiling.gov.in వెబసైట్‌లో "Link Aadhaar" విభాగంలో ఇది లభిస్తుంది. పాన్‌, ఆధార్ నెంబ‌ర్లు, ఆధార్ కార్డు ప్ర‌కారం పేరు వంటి వివ‌రాల‌ను పొందుప‌ర‌చాల్పి ఉంటుంది. మీ మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. దీని ద్వారా ప్రమాణీకరణ పూర్తి అవుతుంది.
  • ఎస్​ఎంఎస్​ ద్వారా అయితే.. 567678/56161కు UIDPAN<12-digit Aadhaar> <10-digit PAN> అని మెసేజ్‌ చేయాలి.
  • పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఈ రెండు ధృవ ప‌త్రాల‌లోనూ మీ పేరు, పుట్టిన తేదీ, జెండ‌ర్ వంటి వివ‌రాలు ఒకేలా ఉండాలి.
  • ఒక‌వేళ ఆధార్ డేటాలో ఉన్న పేరుకు మీరు ఇచ్చిన పేరుకు మ‌ధ్య చిన్న వ్య‌త్యాసం ఉన్నా ఆధార్ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.
  • ఒకవేళ ఆధార్ కార్డులోని పేరుకు, పాన్ నెంబ‌రులోని పేరు పూర్తిగా వేరుగా ఉంటే అనుసంధానం విఫ‌లం అవుతుంది. ఏ కార్డులో త‌ప్పుగా పేరు న‌మోదు అయ్యిందో ఆ కార్డును స‌రిచేసుకుని అప్పుడు అనుసంధానించాలి.

ఇదీ చూడండి:ఆరు నెలల్లో 5 శాతం పెరిగిన విదేశీ మారకం నిల్వలు

ABOUT THE AUTHOR

...view details