తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2019, 8:13 AM IST

ETV Bharat / business

మ్యాజిక్ బెన్​ నుంచి ప్రపంచంలోనే అతి చిన్న ల్యాప్‌టాప్‌!

త్వరలోనే మార్కెట్లోకి ఓ సరికొత్త ల్యాప్​టాప్​ను తీసుకువచ్చేందుకు చైనాకు చెందిన మ్యాజిక్ బెన్ సంస్థ సిద్ధమైంది. స్మార్ట్​ఫోన్​ కన్నా కాస్త పెద్దగా ఉండే ఈ ల్యాప్​టాప్​ ప్రపంచంలోనే అతిచిన్నది. మరి ఆ ల్యాప్​టాప్ విశేషాలు.. ధర వివరాలు మీ కోసం.

laptop
అతిచిన్న ల్యాప్​టాప్​

చైనాకు చెందిన మ్యాజిక్‌ బెన్‌ సంస్థ సరికొత్త ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను తయారుచేసింది. మ్యాగ్1 పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ ప్రపంచంలోనే అతి చిన్నది కావడం విశేషం. దాదాపు ఏ5 కాగితమంత పరిమాణంలో ఉండే ఈ ల్యాప్‌టాప్‌ బరువు కేవలం 700 గ్రాములేనట. అయినప్పటికీ యాపిల్‌ ల్యాప్‌టాప్‌, మ్యాక్‌బుక్‌ కంటే ఎక్కువ పోర్టులు ఇందులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

యూఎస్‌బీ 3.0 పోర్ట్‌, టైప్‌ సీ కనెక్టర్‌, మైక్రోఎస్‌డీ కార్డ్‌ రీడర్‌, ఆడియో సాకెట్‌, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. ఇంటెల్‌ కోర్‌ ఎం3-8100వై సీపీయూ, 16జీబీ మెమొరీ, 512 జీబీ డ్రైవ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. అంతేగాక, దీని డిస్‌ప్లే టచ్‌ స్క్రీన్‌ కావడం మరో ప్రత్యేకత. పేరుకు అత్యంత చిన్న ల్యాప్‌టాప్‌ అయినప్పటికీ.. మ్యాగ్‌1 30ఏహెచ్‌ఆర్‌(ఆంపియర్‌ అవర్‌) బ్యాటరీ సామర్థ్యం కలదని కంపెనీ తెలిపింది. దీని ధర 790 డాలర్లుగా ప్రకటించారు. అయితే దీన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్నది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఇదీ చూడండి:ఈ యంత్రంతో మీ ఇంట్లోనే కూరగాయలు పండించొచ్చు!

ABOUT THE AUTHOR

...view details