తెలంగాణ

telangana

డిసెంబర్​లో పుంజుకున్న వాహన విక్రయాలు

By

Published : Jan 2, 2020, 7:56 AM IST

Updated : Jan 2, 2020, 8:18 AM IST

వాహన విక్రయాలు 2019 డిసెంబర్​లో స్వల్పంగా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా & మహీంద్రాలు ఎక్కువగా వృద్ధిని నమోదు చేయగలిగాయి.

CARS
కార్ల అమ్మకాలు

గత ఏడాది చివర్లో వాహన విక్రయాలు స్వల్పంగా పుంజుకున్నాయి. డిసెంబరు నెల దేశీయ అమ్మకాల్లో మారుతీ సుజుకీ, మహీంద్రా & మహీంద్రాలు వృద్ధిని నమోదు చేయగలిగాయి. హ్యుందాయ్‌, టొయోటా, హోండా, టాటా మోటార్స్‌ మాత్రం నిరాశపరిచాయి. మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాలు 1,21,479 నుంచి 2.4 శాతం వృద్ధి చెంది 1,24,375కు చేరాయి.

వ్యాగన్‌ఆర్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ వంటి కాంపాక్ట్‌ కార్ల అమ్మకాలు 51,346 నుంచి 27.9 శాతం పెరిగి 65,673కు చేరాయి. ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, బ్రెజా వంటి యుటిలిటీ విభాగం విక్రయాలు 20,225 నుంచి 17.7 శాతం పెరిగి 23,808కు చేరాయి. ఇక ఆల్టోతో కూడిన చిన్న కార్ల విభాగం అమ్మకాలు 13.6 శాతం తగ్గాయి. మహీంద్రా అమ్మకాలు 36,690 నుంచి 1 శాతం వృద్ధితో 37,081కు పెరిగాయి. హ్యుందాయ్‌ మోటార్‌ విక్రయాలూ 9.8% తగ్గి 42,093 నుంచి 37,953కు చేరాయి. డిసెంబరులో ఎంజీ మోటార్‌ 3,021 కార్లు విక్రయించింది.

వివిధ కంపెనీల విక్రయాల గణాంకాలు

ఇదీ చూడండి:ఆర్థిక ప్ర‌ణాళిక‌లో యువ‌త నిర్ల‌క్ష్యానికి 12 కార‌ణాలు!

Last Updated : Jan 2, 2020, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details