తెలంగాణ

telangana

ETV Bharat / business

టిక్ టాక్​ ఫౌండర్​ ఝాంగ్ సంచలన నిర్ణయం

టిక్ టాక్ వ్యవస్థాపకులు ఝాంగ్ యిమింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మాతృసంస్థ బైట్ డాన్స్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

By

Published : May 20, 2021, 11:49 AM IST

ByteDance founder Zhang Yiming to step down as CEO
బైట్ డాన్స్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటోన్న ఝాంగ్ ఇమింగ్

చైనా టెక్ దిగ్గజం, టిక్ టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ సీఈఓ పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు గురువారం ఝాంగ్ వెల్లడించారు. కొత్త సీఈఓ బాధ్యతలను సంస్థ మానవ వనరుల విభాగాధిపతి లియాంగ్ రూబో చేపట్టనున్నట్లు బైట్ డాన్స్ తెలిపింది.

2012లో ప్రారంభమైన బైట్ డాన్స్.. చైనాలో అతిపెద్ద సామాజిక శక్తిగా అవతరించింది. టిక్టాక్తో ప్రపంచవ్యాప్తంగా యువతలో విశేష ఆదరణ పొందింది. అయితే ఈ ఏడాది చివరినాటి కల్లా సంస్థలో ఓ 'కీలక వ్యూహాత్మక' పదవిలో తాను కొనసాగనున్నట్లు ఝాంగ్ స్పష్టం చేశారు.

బైట్ డాన్స్ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా సీఈఓగా తప్పుకుంటున్నట్లు ఝాంగ్ తెలిపారు. సంస్థ నిర్వహణ కన్నా తనకు సంస్థాగత, మార్కెట్ సూత్రాలను విశ్లేషించడంలో ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:కొత్త ప్రైవసీ పాలసీలపై వాట్సాప్​కు కేంద్రం వార్నింగ్!

ABOUT THE AUTHOR

...view details