దేశంలో అధిక వేతనాలు అందుకుంటున్న వారిలో ఐటీ ఉద్యోగులు ప్రథమ స్థానంలో ఉండగా.. అత్యధిక జీతాలు ఉండే నగరాల జాబితాలో బెంగళూరు మరో సారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఓ నివేదికలో తేలింది.
'రాండ్‌స్టాడ్స్ ఇన్సైట్స్ శాలరీ ట్రెండ్ రిపోర్ట్ 2019'.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఉండే నగరాల జాబితాలో 2017, 2018లోనూ బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నట్లు నివేదికలో తెలిసింది.
ఈ నివేదిక ప్రకారం బెంళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం సుమారు రూ.5.27 లక్షలుగా ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ మధ్య స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం దాదాపు రూ.16.45 లక్షలుగా, సీనియర్ స్థాయి ఉద్యోగులకు రూ.35.45 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది.
రెండో స్థానంలో హైదరాబాద్..
జూనియర్ ఉద్యోగులు అధిక వేతనాలు పొందే నగరాల జాబితాలో హైదరాబాద్, ముంబయిలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో తెలిసింది. జూనియర్ స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం హైదరబాద్‌లో రూ.5 లక్షలుగా, ముంబయిలో రూ.4.59 లక్షలుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
బెంగళూరు తర్వాత వేతనాలు ఇలా..
మధ్య స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనాలు ముంబయిలో రూ.15.07 లక్షలుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో రూ.14.5 లక్షలుగా ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడైంది.
సీనియర్ స్థాయి ఉద్యోగులకు వార్షిక వేతనాలు ముంబయిలో రూ.33.95 లక్షలుగా, పుణెలో 35.84 లక్షలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
రంగాల వారీగా ఇలా..
సీనియర్ స్థాయిలో డిజిటల్ మార్కెట్ నిపుణులకు అధికంగా వేతనాలు (సగటున ఏడాదికి రూ.35.84 లక్షలు) ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
డిజిటల్ నైపుణ్యాలు, క్లౌడ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, విశ్లేషణ, కృత్రిమమేధ, ఆటోమేషన్ రంగాల్లో ఈ ఏడాది వేతనాలు భారీగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
రంగాలవారీగా చూస్తే.. జూనియర్ స్థాయిలో జీఎస్టీ నిపుణులకు, అకౌంటెంట్లకు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్లకు, లాయర్లకు అధిక వేతనాలు డిమాండు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వార్షిక వేతనాల్లో వీరు రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది నివేదిక.
మొత్తం 15 పరిశ్రమలో.. 1,00,000 మందిపై జరిపిన సర్వే ద్వారా వేతనాల విశ్లేషణ చేసింది. మొత్తం 8 ప్రధాన పట్టణాల్లో ఈ సర్వే జరిగింది.
ఇదీ చూడండి:మారుతీ నుంచి మరో చిన్న కారు.. ధర ఎంతంటే?