తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 26, 27 తేదీల్లో చేయాలనుకున్న సమ్మెను బ్యాంకు సంఘాలు విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థిక కార్యదర్శితో బ్యాంకు సంఘాల నాయకులు జరిపిన చర్చలు ఫలించినందున ఈ నిర్ణయం తీసుకున్నాయి.
చర్చలు సఫలం.. బ్యాంకుల సమ్మె విరమణ
ఈనెల 26, 27 తేదీల్లో తలపెట్టిన సమ్మెను బ్యాంకు సంఘాలు విరమించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
చర్చలు సఫలం.. బ్యాంకుల సమ్మె విరమణ
నాలుగు బ్యాంకు అధికారుల సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్ సోమవారం భేటీ అయ్యారు. వేతన సవరణ, ఐదురోజుల పనిదినాలు, బ్యాంకుల విలీనం, నగదు లావాదేవీల సమయంపై వారి మధ్య చర్చ జరిగింది. సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం రాజీవ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. వారు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజీవ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఫలితంగా సమ్మెను విరమించుకుంటున్నట్లు బ్యాంకు అధికారుల సంఘాలు ప్రకటించాయి.
- ఇదీ చూడండి: ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!
Last Updated : Oct 1, 2019, 7:02 PM IST