తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఫోన్ సేల్స్​ అదుర్స్​- ​​​​​​​యాపిల్ ఆల్​టైం రికార్డు

గత ఏడాది డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో టెక్​ దిగ్గజం యాపిల్ 22 బిలియన్ డాలర్ల ఆల్​టైం రికార్డు లాభాన్ని గడించింది. కేవలం ఐఫోన్​ల అమ్మకాల ద్వారా ఈ త్రైమాసికంలో 55.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది యాపిల్.

apple
యాపిల్

By

Published : Jan 29, 2020, 11:13 AM IST

Updated : Feb 28, 2020, 9:26 AM IST

అమెరికాకు చెందిన లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్ గత ఏడాది చివరి త్రైమాసికంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2019 అక్టోబర్​-డిసెంబర్​ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 22 బిలియన్​ డాలర్ల నికర లాభాన్ని గడించింది. ఈ సమయంలో సంస్థ ఆదాయం 91.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు యాపిల్ తెలిపింది.

"గతంలో ఎన్నడూ లేనంతగా లాభాలు ప్రకటించడం ఆశ్యర్యంగా అనిపిస్తోంది. ఐఫోన్​ 11, ఐఫోన్ 11 ప్రో మోడళ్లకు, యాపిల్ సేవలకు, ఇతర గాడ్జెట్లకు రికార్డు స్థాయిలో డిమాండు రావడం.. ఈ లాభాలకు కారణం." -టిమ్​కుక్​, యాపిల్​ సీఈఓ

ఆదాయం ఇలా..

గత ఏడాది డిసెంబర్​ నాటికి ముగిసిన త్రైమాసికంలో యాపిల్​కు ప్రధాన ఆదాయ వనరు ఆయిన ఐఫోన్ల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగింది. ఈ సమయంలో సంస్థ 55.9 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 2019 డిసెంబర్​ త్రైమాసికంలో 17 శాతం వృద్ధితో 12.7 బిలియన్​ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది యాపిల్ టీవీ ప్లస్​ పేరుతో 100కు పైగా దేశాల్లో ఆవిష్కరించిన ఆన్​ డిమాండ్​ వీడియో సేవల కారణంగా ఈ వృద్ధి నమోదైంది.

హోంపాడ్​ స్పీకర్స్, యాపిల్​ వాచ్​ సహా ఇతర గాడ్జెట్లు, గృహోపకరణాల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 37 శాతం పెరిగి.. మొత్తం 10 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు యాపిల్ తెలిపింది.

ఇదీ చూడండి:ఉద్యోగ, వ్యక్తిగత జీవిత సమతుల్యమే కీలకపాత్ర..!

Last Updated : Feb 28, 2020, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details