భారత్‌లో 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా.. టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమచారం మేరకు 5జీ ట్రయల్స్ కోసం ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు.. హువావే, జెడ్‌టీఈ, ఎరిక్సన్, నోకియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా జియో.. శాంసంగ్‌తో చేతులు కలిపినట్లు తెలిసింది.
ఆ ప్రకటనే సానూకూలతలు పెంచింది..
సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత నెలలో.. ప్రభుత్వం ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం సంస్థలకు 5జీ సిగ్నల్స్‌ను అందివ్వనున్నామని తెలిపారు. ఈ ట్రయల్‌కు ఉపకరణాలు అందించే సంస్థలపై ఎలాంటి అంక్షలు లేవని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆంక్షలు ఎదుర్కొంటున్న హువావేకు ఊరటనిచ్చినట్లయింది. ఇది 5జీ ట్రయల్స్‌కు మరింత సానుకూలతలు పెంచింది.