తెలంగాణ

telangana

ETV Bharat / business

స్మార్ట్​ఫోన్​ దిగ్గజాల 'ఆపరేషన్​ త్రినేత్ర'

2021 నాటికి 50 శాతం స్మార్ట్ ఫోన్లకు కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలు ఉంటాయని ఓ నివేదిక అంచనా వేసింది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నడుస్తున్న "మెగా పిక్సల్ వార్" ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది.

'ఆపరేషన్​ త్రినేత్ర'

By

Published : May 17, 2019, 1:01 PM IST

స్మార్ట్ ఫోన్​ కంపెనీల మధ్య ప్రస్తుతం "మెగా పిక్సల్ వార్​" నడుస్తోంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే 50 శాతం స్మార్ట్ ఫోన్లకు మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలు ఉంటాయని కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్​ సంస్థ అంచనా వేసింది.

2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లలో దాదాపు 6 శాతం స్మార్ట్​ ఫోన్లకు మూడు, అంతకన్నా ఎక్కువ కెమెరాలు ఉన్నట్లు కౌంటర్​ పాయింట్​ సంస్థ తెలిపింది.

ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 15 శాతానికి చేరుతుందని.. 2020 చివరి నాటికి 35 శాతానికి పెరగొచ్చని లెక్కగట్టింది.
2021 నాటికి ఏకంగా 50 శాతం స్మార్ట్ ఫోన్లు మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలతో అందుబాటులోకి రావచ్చని తెలిపింది.

అన్నీ త్రినేత్రాలే...

ఈ ఏడాది ఏప్రిల్​లో విడుదలైన స్మార్ట్​ ఫోన్లలో 40కి పైగా మోడళ్లు మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలు కలిగి ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్​ దిగ్గజాలైన హువావే, శామ్​సంగ్​లు మెగాపిక్సల్​ పోటీలో ముందువరుసలో ఉన్నాయి. హువావే మేట్​, పీ శ్రేణి​, శామ్​సంగ్​ గెలాక్సీ ఏ శ్రేణి​, వివో వీ15 ప్రో మోడల్​ ఫోన్లు ప్రధానంగా మూడు కెమెరాలతో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఏడాది చివరి నాటికి లగ్జరీ స్మార్ట్​ ఫోన్ కంపెనీ యాపిల్​ సహా వన్​ ప్లస్​ సంస్థలు మూడు కెమెరాల స్మార్ట్​ ఫోన్లు ఆవిష్కరించనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో 64 మెగా పిక్సల్​ కమెరాతో స్మార్ట్ పోన్లు అందుబాటులోకి తీసుకురానున్నాయి.

"2020 నాటికి స్మార్ట్​ ఫోన్ కెమెరా 100 మెగా పిక్సల్​ను దాటొచ్చని అంచనా వేస్తున్నాం. గూగుల్ పిక్సల్ శ్రేణిలో ఇప్పటివరకు​​ రెండు కెమెరాలను కూడా తీసుకురాలేదు. ఆ సంస్థ సాఫ్ట్​వేర్​తో నాణ్యమైన చిత్రాలను అందించేందుకే మొగ్గుచూపుతుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో రెండు కెమెరాలను అందిపుచ్చుకుంటున్న ఇతర కంపెనీలతో గూగుల్ ఇకముందు ఆవిష్కరించే స్మార్ట్ ఫోన్లకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది."
- హనీశ్​ భాటియా, సీనియర్ అనలిస్ట్​, కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్​

ABOUT THE AUTHOR

...view details