తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎవరైనా నేర్చుకునేలా యూట్యూబ్​ పాఠాలు! - యూట్యూబ్​ పాఠాలు

యూట్యూబ్... వివిధ అంశాలను సమగ్రంగా అభ్యసించడానికి వేదికగా మారుతోంది. నేర్చుకోవడానికి వీలుగా ఎన్నో వీడియోలను అందుబాటులోకి తెచ్చింది ఆ సంస్థ. తల్లిదండ్రులు, విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులూ వీటిని ఉపయోగించుకోవచ్చు.

Youtube lessons from Youtube Learning Destination
ఎవరైనా నేర్చుకునేలా యూట్యూబ్​ పాఠాలు!

By

Published : Apr 30, 2020, 1:02 PM IST

నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం గూగుల్‌ సంస్థ.. యూట్యూబ్‌లో ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. అదే- ‘యూట్యూబ్‌ లర్నింగ్‌ డెస్టినేషన్‌’. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైనవారి కోసం దీనిని ప్రవేశపెట్టింది. నేర్చుకోవడానికే కాకుండా బోధనకూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించింది. దీనిలో కరిక్యులమ్‌ అంశాలతోపాటు ఆసక్తి ఆధారిత అంశాలకూ ప్రాధాన్యమిచ్చింది. దీనిని డెస్క్‌టాప్‌తోపాటు మొబైల్‌లోనూ ఉపయోగించుకునేలా రూపొందించారు.

వీడియోలు ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. తరువాత తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ, ఇతర స్థానిక భాషల్లోనూ అందించనున్నారు. కరిక్యులమ్‌ పరంగా.. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, బయాలజీ, టాక్సానమీ అంశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిజజీవిత ఉదాహరణలతోపాటుగా, సులువుగా అర్థమయ్యేలా అందిస్తున్నారు. కరిక్యులమ్‌ అంశాలన్నీ కేటగిరీలవారీగా విభజించి ఉంటాయి. విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టునూ, దానిలోని అంశాన్నీ ఎంచుకునే వీలుంది.

స్టడీ టిప్స్‌, రైటింగ్‌ ట్రిక్స్‌నూ జోడించారు. ఇవేకాకుండా కొత్తగా వేరే అంశాలను నేర్చుకోవాలనుకునేవారికి ఇతర నైపుణ్యాలు- ఫొటోగ్రఫీ, యోగా, మ్యూజిక్‌, గార్డెనింగ్‌ వంటివీ అందుబాటులో ఉన్నాయి. లర్న్‌ బై డూయింగ్‌, ఇంగ్లిష్‌ వర్క్‌ప్లేస్‌ కాన్‌వర్‌సేషన్స్‌, విదేశీ భాషలకూ ప్రాధాన్యమిచ్చారు. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్ఛు ఇతర వివరాలకు.. https://www.youtube.com/learning వెబ్‌సైట్‌ లింకును సందర్శించవచ్చు.

ఇదీ చదవండి:50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్​ అదిరిందమ్మా!

ABOUT THE AUTHOR

...view details