తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్​ఆర్​ఐలకు శుభవార్త- ఆ కాలాన్ని లెక్కించరట! - కరోనా వైరస్​

లాక్​డౌన్​ వల్ల దేశంలో చిక్కుకుపోయి... పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న ఎన్​ఆర్​ఐలకు కేంద్రం ఉపశమనం కలిగించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 6ను ఉపయోగించుకుని.. లక్​డౌన్​ వల్ల వారు దేశంలో ఉన్న రోజులను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది.

Your NRI status not under threat if you are stuck in India due to lockdown
ఎన్​ఆర్​ఐలకు శుభవార్త.. ఆ కాలాన్ని లెక్కించరట!

By

Published : May 9, 2020, 11:37 AM IST

లాక్​డౌన్​ వల్ల భారత్​లో అనేకమంది ఎన్​ఆర్​ఐలు చిక్కుకుపోయారు. తాజాగా వీరికి కేంద్రం ఉపశమనం కలిగించింది. లాక్​డౌన్​ వల్ల వీరు దేశంలో ఉన్న కాలాన్ని పరిగణించమని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 6 మేరకు ఈ సౌలభ్యం కలిపిస్తున్నట్టు పేర్కొంది.

దేశంలో చిక్కుకుపోవడం వల్ల పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుందని ఎన్​ఆర్​ఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టతనిచ్చింది సీబీడీటీ(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)

విమాన సేవల పునరుద్ధరణ జరిగిన అనంతరం.. గడువు పెంపును మినహాయించి వీరి నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

సీబీడీటీ ప్రకటన

గత సంవత్సం(2019-2020)లో అనేక మంది భారత్​కు వచ్చారు. తమ ఎన్​ఆర్​ఐ గుర్తింపుపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండటానికి.. గత ఆర్థిక సంవత్సరంలోనే వెనక్కి వెళ్లిపోవాలని భావించారు. కానీ లాక్​డౌన్​ కారణంగా వారిలోని చాలా మంది దేశంలో చిక్కుకుపోయారు.

సంవత్సర కాలంలో ఓ వ్యక్తి ఎన్ని రోజుల పాటు దేశంలో ఉన్నాడనే దానిపై అతడు భారత దేశస్థుడా? లేక ఎన్​ఆర్​ఐనా? అన్న విషయం ఆధారపడి ఉంటుంది.

ఇదీ చూడండి:-'వర్క్ ఫ్రం హోమ్' చేసే వారికి జియో గుడ్​ న్యూస్​!

ABOUT THE AUTHOR

...view details