తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్రబ్యాంకుల్లో ఆర్​బీఐ టాప్​.. ఫాలోవర్లతో రికార్డు! - RBI twitter followers

భారతీయ రిజర్వు బ్యాంకు మరో ఘనత సాధించింది. ఇప్పటికే ప్రపంచంలోనే శక్తిమంతమైన కేంద్రబ్యాంక్​గా గుర్తింపు పొందిన ఆర్బీఐ.. తాజాగా అత్యధిక మంది ట్విట్టర్​ ఫాలోవర్లు కలిగిన కేంద్రబ్యాంకుగా రికార్డు సృష్టించింది.

With 7.45 lakh followers, RBI most popular among central banks on Twitter
అత్యధిక ఫాలోవర్లు కలిగిన బ్యాంకుగా ఆర్బీఐ!

By

Published : Apr 30, 2020, 5:26 PM IST

ప్రపంచంలోనే శక్తిమంతమైన కేంద్ర బ్యాంక్​గా ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరో ఘనత సాధించింది. అత్యధిక మంది అనుసరిస్తున్న ట్విట్టర్​ ఖాతాను కల్గిన కేంద్ర బ్యాంకుగా రికార్డు సృష్టించింది. ఆర్బీఐ ట్విట్టర్​ ఖాతాను సుమారు 7,45,000 మంది అనుసరిస్తుండగా.. ప్రపంచంలోని ఇతర దేశాల కేంద్ర బ్యాంకులన్నింటిలో ఇదే అత్యధికం.

అత్యధిక ఫాలోవర్లు కలిగిన బ్యాంకుగా ఆర్బీఐ!

2019 మార్చిలో ఆర్బీఐ ట్విట్టర్​కు ఫాలోవర్లు.. 3,20,000 మంది ఉండగా, 13 నెలల కాలంలో ఈ సంఖ్య రెట్టింపైంది. లాక్​డౌన్​ ప్రారంభమైన మార్చి 25 నుంచి మరో ఒకటిన్నర లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. 2012 జనవరిలో రిజర్వ్​​ బ్యాంకు... ఆర్బీఐ పేరుతో ట్విట్టర్​ ఖాతాను ప్రారంభించింది.

టాప్-3 లో ఇవే..

ఆర్బీఐ తర్వాత 7,15,000 మంది ఫాలోవర్లతో 'బ్యాంక్​ ఇండోనేసియా', 'ఈస్ట్​ ఏషియా సెంట్రల్​ బ్యాంకు'లు రెండోస్థానంలో నిలిచాయి. 7,11,000 మంది అనుసరిస్తున్న మెక్సికో కేంద్ర బ్యాంక్.. 'బ్యాంకో డీ మెక్సికో' మూడో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి:వారందరితో డేటాను పంచుకుంటాం: ట్విట్టర్

ABOUT THE AUTHOR

...view details