కరోనా వ్యాప్తి నేపథ్యంలో తరచుగా ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌లపై పరిమితి విధిస్తూ వాట్సాప్ తీసుకున్న నిర్ణయం ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమ యాప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు 70 శాతం వరకు తగ్గినట్లు వాట్సాప్ ప్రకటించింది.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. స్నేహితులు, బంధులను కలుసుకునే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వంటి యాప్‌లలో సంభాషణలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో కరోనాకు సంబంధించిన అసత్య సమాచారాన్ని నిర్ధరించుకోకుండానే చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారు.