తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​ నయా రికార్డ్​- 500 కోట్లు దాటిన డౌన్​లోడ్స్​

2019లో ప్లేస్టోర్​ నుంచి 5 బిలియన్​ డౌన్​లోడ్స్ సాధించి.. వాట్సాప్ ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన గూగుల్ యేతర యాప్​గా నిలిచింది.

WhatsApp Crosses 5 Billion Downloads on the Play Store
వాట్సాప్​ నయా రికార్డ్​- 500 కోట్లు దాటిన డౌన్​లోడ్స్​

By

Published : Jan 21, 2020, 6:36 PM IST

Updated : Feb 17, 2020, 9:30 PM IST

​వాట్సాప్​ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 2019లో ప్లేస్టోర్​ నుంచి 5 బిలియన్​ డౌన్​లోడ్స్ సాధించి.. ఈ మైలురాయిని చేరుకున్న గూగుల్ యేతర రెండో యాప్​గా నిలిచింది.

స్టాటిస్టా ప్రకారం... నెలవారీ క్రియాశీల వినియోగదారులు కలిగిన ఉన్న మొబైల్​ మెసెంజర్ యాప్​లలో 1.6 మిలియన్ల యూజర్స్​తో వాట్సాప్​ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. 1.3 మిలియన్ వినియోగదారులతో ఫేస్​బుక్​ రెండో స్థానంలో, 1.1 బిలియన్ వినియోగదారులతో వీ-చాట్​ మూడో స్థానంలో ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే... ఫేస్​బుక్​, యూట్యూబ్​ తరువాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్నది వాట్సాప్​ మాత్రమే.

దక్షిణా కొరియాలో

గూగుల్ ప్లేస్టోర్ విషయానికి వస్తే... దక్షిణ కొరియాలో వాట్సాప్ దూసుకుపోతోంది. 2019లో ఇక్కడ దాదాపు 56 శాతం డౌన్​లోడ్స్​ను వాట్సాప్​ సాధించింది.

ఫేస్​బుక్​.. మొదటిసారిగా

గత ఐదేళ్లుగా అగ్రశ్రేణి మొబైల్​ యాప్​ ప్రచురణకర్తగా ఉన్న ఫేస్​బుక్​ను మొదటిసారిగా గూగుల్ పక్కకునెట్టింది. సెన్సార్ టవర్​ నివేదిక ప్రకారం 2019 చివరి త్రైమాసికంగా గూగుల్​ 850 మిలియన్ డౌన్​లోడ్స్ సాధించగా, ఫేస్​బుక్​ మాత్రం 800 మిలియన్​ డౌన్​లోడ్స్​కే పరిమితమైంది.

గత 12 మాసాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఫేస్​బుక్ 3 బిలియన్ డౌన్​లోడ్స్​తో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో గూగుల్ 2.3 బిలియన్ డౌన్​లోడ్స్​ మాత్రమే సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, మెసెంజర్​లు ఫేస్​బుక్​వే కావడం గమనార్హం. అయితే చైనా సామాజిక మాధ్యమం టిక్​టాక్ రెండో స్థానానికి దూసుకురావడం విశేషం.

ఇదీ చూడండి: స్థిరాస్తి ధరల వృద్ధిలో వరల్డ్​ నెం.14గా హైదరాబాద్

Last Updated : Feb 17, 2020, 9:30 PM IST

For All Latest Updates

TAGGED:

WhatsApp

ABOUT THE AUTHOR

...view details