తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2020, 6:36 PM IST

ETV Bharat / business

ఎంఐ ఫోన్లలోని ఆ యాప్​ల పరిస్థితి ఏంటి?

భారత్​ వినియోగదారుల డేటాను విదేశాలతో పంచుకుంటున్నాయని 59 చైనా యాప్​లపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. షియోమీకి చెందిన ఎమ్​ఐ కమ్యూనిటీ, ఎమ్​ఐ వీడియో కాల్​ యాప్​లు ఈ జాబితాలో ఉన్నాయి. మరి మొబైల్​తోనే ప్రీ ఇన్​స్టాల్​ అయి వచ్చే ఈ యాప్​లు ఫోన్లలోనే ఉండిపోతే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అనేది కొందరికి సందిగ్ధంగా మారింది.

xiaomi app news
ఎంఐ ఫోన్లలో ఆ యాప్​ల పరిస్థితి ఏంటి?

భారత స్మార్ట్​ఫోన్​ విపణిలోకి అడుగుపెట్టిన షియోమీ సంస్థ.. అంచెలంచెలుగా ఎదిగి ఆరేళ్ల కాలంలోనే టాప్​ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. భారత వినియోగదారుల డేటాను చైనాతో పంచుకుంటూ, నిషేధానికి గురైన యాప్​ల జాబితాలో ఈ సంస్థకు చెందిన రెండు యాప్​లు(ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ వీడియో కాల్​) ఉన్నాయి. ప్రీ ఇన్​స్టాల్ అయి ఫోన్​తో వచ్చే వీటిని యూజర్లు​ తొలగించలేరు. మరి నిషేధించిన యాప్​లు ఫోన్​లో ఉంటే సమస్యలు వస్తాయా?

ప్రభుత్వం యాప్​లను బ్యాన్​ చేసినా కొన్ని రోజుల పాటు అత్యవసర సేవల యాప్​లను కొనసాగించనున్నారు. ఈ లోపు యూజర్లు వేరే యాప్​లను ఎంపిక చేసుకుంటారు. నిషేధిత సంస్థలు కూడా కొన్ని రోజుల తర్వాత అప్​డేట్​ ఇవ్వడం, డేటాను అప్​డేట్​ చేయడం వంటివి చేసేందుకు అనుమతి ఉండదు. ఫలితంగా ఆ యాప్​లు నిరుపయోగంగా మారతాయి. అయితే దీనివల్ల ఫోన్​లో కాస్త స్పేస్​ వృథా అవుతుంది. ఎప్పుడైనా మొబైల్​ సంస్థ ఓఎస్​ అప్​డేట్​ విడుదల చేసినప్పుడు వాటిని తొలగించే అవకాశాలు ఉంటాయి.

ఇప్పటికే కొత్త గళం...

భారత మార్కెట్​లో 31.2 శాతం షేర్​ ఉన్న షియోమీ సంస్థ.. ఇటీవల కాలంలో 'మేడిన్​ ఇండియా' మంత్రం జపిస్తోంది. చైనాతో గల్వాన్​ ఘర్షణ తర్వత ఈ విషయంలో మరింత జోరు పెంచింది. ఇందుకు కారణం స్మార్ట్​ఫోన్లు, టీవీలు, ల్యాప్​టాప్​లు, ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల అమ్మకాల్లో భారత విపణిలో టాప్​ స్థానంలో ఉండటమే. ఆ మార్కెట్​ను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తోంది షియోమీ. భారత ప్రభుత్వానికే పన్నులు కడుతున్నామని.. దేశంలోనే పలు స్టార్టప్​లలో పెట్టుబడులు పెట్టామని చెప్తోంది. అంతేకాకుండా సంస్థ ఆర్​&డీ భారత్​లోనే ఉందని.. యాజమాన్యం సహా 50వేల ఉద్యోగులు ఇక్కడివారేనని పదేపదే గుర్తుచేస్తోంది.

టాప్​-100లో సగం..?

భారతీయ యాప్​ మార్కెట్​లోనూ చైనీయుల హవా పెరుగుతోంది. 2017లో టాప్​-100 యాప్​లలో 17 మాత్రమే ఉంటే.. 2018లో అవి 44కు పెరిగాయి. ఏడాది కాలంలోనే అవి దాదాపు మూడింతలయ్యాయి. భారత వినియోగదారులు చైనా యాప్​ల వినియోగం తగ్గిస్తే.. ఆ దేశ సంస్థలు భారీగా నష్టాలు ఎదుర్కోనున్నాయి. 30 శాతం వినియోగదారులున్న ఒక్క టిక్​టాక్​ సంస్థే 10 శాతం ఆదాయం కోల్పోతుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది.

ABOUT THE AUTHOR

...view details