అనుకోని ప్రమాదం.. తీవ్ర అనారోగ్యం.. కారణమేదైనా సరే.. ఆసుపత్రిలో చేరితే బిల్లు లక్షల రూపాయల్లోనే.. ఇలాంటప్పుడే ఆరోగ్య బీమా అవసరమేమిటో తెలుస్తుంది. మనకేమి అవసరం అనుకుంటూ.. చాలామంది ఇప్పటికీ దీన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఒక ఆరోగ్య బీమా ఉండాలనే లక్ష్యంతోపాటు.. సామాన్యుల అవసరాలకు తగ్గట్టుగా ఒక పథకం ఉండాలని భావించిన ఐఆర్‌డీఏ ప్రత్యేకంగా ఓ ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీని రూపొందించింది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ పాలసీ పేరు ఆరోగ్య సంజీవని. అన్ని సాధారణ బీమా సంస్థలు ఈ పాలసీని ఇదే పేరుతో అందిస్తున్నాయి.
అందుబాటులో ఎన్నో ఆరోగ్య బీమా పాలసీలున్నాయి. ఒక పాలసీకి మరో దానికీ సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది. వీటిలో నిబంధనలను అర్థం చేసుకోవడమూ అంత తేలికేమీ కాదు. బీమా సంస్థలను బట్టి, ఆయా నియమాలు మారుతుంటాయి. ఇలాంటి గందరగోళానికి తావులేకుండా ఏ సంస్థ నుంచి ఈ ఆరోగ్య సంజీవని పాలసీ తీసుకున్నా.. నియమ నిబంధనలు, షరతులన్నీ ఒకే విధంగా ఉంటాయి. ప్రీమియాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ బీమా సంస్థలకు ఉంటుంది.
ఎంత మొత్తం?
పాలసీదారుల కనీస అవసరాలను తీర్చే విధంగా ఈ పాలసీ ఉండాలనేది ఐఆర్‌డీఏ లక్ష్యం. అందుకే, కనీస మొత్తం రూ.లక్ష నుంచి అందుబాటులో ఉంది. రూ.50వేల చొప్పున పెంచుకుంటూ.. గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ పాలసీని తీసుకోవచ్ఛు వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ కలిపి ఫ్లోటర్ పాలసీగానూ దీన్ని ఎంచుకోవచ్ఛు.
అర్హత
18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు వారి పేరుమీద పాలసీని జారీ చేస్తారు. జీవితాంతం వరకూ పునరుద్ధరించుకోవచ్ఛు కుటుంబం మొత్తానికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకున్నప్పుడు.. జీవిత భాగస్వామితో పాటు, తల్లిదండ్రులు, అత్తామామల పేర్లనూ పాలసీలో చేర్పించవచ్ఛు 3 నెలల వయసు నుంచి 25 ఏళ్ల వరకూ వయసున్న పిల్లలను పాలసీ రక్షణ పరిధిలోకి తీసుకురావచ్ఛు ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు దాటి, సొంతంగా సంపాదన ఉంటే వారికి ప్రత్యేకంగా పాలసీ తీసుకోవాల్సి వస్తుంది.
45 ఏళ్ల లోపు వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే పాలసీ ఇస్తారు. 45 ఏళ్లు దాటిన వారికి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.
పాలసీ వ్యవధి:
ఈ పాలసీ ఏడాది పాటు అమల్లో ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు..