తెలంగాణ

telangana

ETV Bharat / business

రేట్ల కోత అమలును సమీక్షిస్తున్నాం: విత్త మంత్రి

ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపనల పని తీరును సమీక్షిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రుణాలపై వడ్డీ తగ్గింపు సహా, ఎంఎస్​ఎంఈలకు లోన్​ల మంజూరు అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

By

Published : Jun 20, 2020, 10:46 AM IST

Closely monitoring relief measure
ఉద్దీపనలు సమీక్షిస్తున్నాం

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇచ్చిన ఉద్దీపనల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గింపును కంపెనీలు, వినియోగదారులకు బ్యాంకులు ఎలా బదిలీ చేస్తున్నాయి.. అనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు తెలిపారు. పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, వాణిజ్య రంగ జరిగిన సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు సీతారామన్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) 'ఆత్మ నిర్భర్​ భారత్'​లో ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ రుణాలను కూడా ఎలా అందిస్తున్నారో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎంఎస్​ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

లబ్ధిదారుకు మెరుగవుతున్న ప్రయోజనాలు..

రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేయడం క్రమంగా మెరుగవుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వివరించారు. రూ.20.97 లక్షల కోట్ల ఉద్దీపన పథకాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పీహెచ్‌డీ ఛాంబర్‌ పేర్కొంది. పర్యాటక, విమానయాన, వినోద, స్థిరాస్తి, వాహన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నందున, ఆయా రంగాలకు ఇచ్చిన రుణాల వర్గీకరణలో తేడా లేకుండా, పునర్‌వ్యవస్థీకరించాలని సూచించింది.

ఇదీ చూడండి:మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

ABOUT THE AUTHOR

...view details