అమెరికాలో మంగళవారం భారీగా పతనమైన చమురు ధరలు ఈరోజు స్వల్పంగా కోలుకున్నాయి. మే నెల కాంట్రాక్టుకు సంబంధించి అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్లూటీఐ) ఫ్యూచర్స్‌ట్రేడింగ్‌లో ధరలు బ్యారెల్కు 10.01డాలర్ల వద్ద ముగిశాయి. మంగళవారం ఈ ధర మైనస్ -37.63 డాలర్లుగా ఉంది.
డబ్ల్యూటీఐ ఫ్యూచర్స్ జూన్ మసానికి సంబంధించి కాంట్రాక్టులు మాత్రం 43శాతం మేర పడిపోయాయి. బ్యారెల్ ధర 11.57 డాలర్లుగా ఉంది. 1983 తర్వాత ఇదే అత్యల్పం.
ఆదుకుంటాం: ట్రంప్
అమెరికా చమురు సంస్థలు గతంలో ఎన్నడూ లేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని ఆదుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చమురు, గ్యాస్ కంపెనీలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఒపెక్ దేశాల సమావేశం...
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో ఒపెక్ దేశాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాయి. చమురు ధరలపై కరోనా ప్రభావం గురించి చర్చించారు ఆయా దేశాల ప్రతినిధులు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు రష్యా ఇంధన శాఖ మంత్రి తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో తాము పాల్గొనలేదని పేర్కొన్నారు. ఈ చర్చలో చమురు ఉత్పత్తిలో కీలక దేశమైన సౌదీ అరేబియా కూడా పాల్గొందో లేదో స్పష్టత లేదు.
ఇదీ చూడండి: ఫేస్బుక్ నుంచి త్వరలో ఉచిత గేమింగ్ యాప్!