తెలంగాణ

telangana

ETV Bharat / business

'పర్యాటక రంగాన్ని తక్షణమే పునరుద్ధరించాలి'

పర్యాటక, ఆతిథ్య రంగాలను తక్షణమే పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరింది భారత పర్యాటక, ఆతిథ్య రంగాల పరిశ్రమల సమాఖ్య. ఈ మేరకు అత్యవసరంగా చర్యలు చేపట్టాలని, దిల్లీలోని హోటల్​లను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది.

Urgent steps by the govt needed to revive tourism sector, says industry
'పర్యాటక రంగాన్ని తక్షణమే పునరుద్ధరించాలి'

By

Published : Aug 13, 2020, 5:09 AM IST

కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పర్యాటక, ఆతిథ్య రంగాలను పునరుద్ధరించించేందుకు అత్యవసరంగా చర్యలు చేపట్టాలని భారత పర్యాటక, ఆతిథ్య రంగాల పరిశ్రమల సమాఖ్య (ఫెయిత్‌) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యాటక శాఖతో సమావేశం అనంతరం ఈ మేరకు తెలిపింది. పర్యాటక రంగాన్ని తిరిగి ప్రారంభించడానికి డిమాండ్​ ఉత్పత్తి, సరఫరా రక్షణ చర్యలు తక్షణమే అమలు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

పర్యాటక రంగ పునరుద్ధరణకు ద్వంద టాస్క్​ ఫోర్స్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది ఫెయిత్. కేంద్ర స్థాయిలో ఓ టాస్క్​ ఫోర్స్, రాష్ట్ర స్థాయిలో మరో టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని సూచించింది.

అంతర్జాతీయ పర్యాటక ఆపరేటర్లలో విశ్వాసం నింపడానికి 'ఇండియన్ టూరిజం మార్ట్​' ప్రదర్శనను నవంబరు మొదటి వారం లేదా నాలుగో వారాల్లో నిర్వహించాలని పర్యాటక శాఖను కోరింది ఫెయిత్​. దిల్లీలోని హోటల్​లను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి: కరోనా సంక్షోభంలో పెట్టుబడులు కాపాడుకోండిలా...

ABOUT THE AUTHOR

...view details