తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2020, 9:02 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

ETV Bharat / business

హ్యాకర్ల నుంచి మీ ఫోన్​ను రక్షించే యాప్​లివే...

ఫోన్​ చేతిలో ఉంటే ఈ ప్రపంచాన్నే చుట్టేయొచ్చోన్న ధీమా. ఏమైనా చూడొచ్చు.. ఏదైనా చేయొచ్చనే నమ్మకం. ఇలా ప్రతి పనీ ఇప్పుడు మొబైల్​ ద్వారానే చేసేస్తున్నాం. మనమిలా స్వేచ్ఛగా నెట్టింట్లో విహరించే సమయంలో.. అంతే స్వేచ్ఛగా హ్యాకర్లు కూడా ట్రేస్​ చేసేస్తున్నారు.! అయితే హ్యాకర్ల బారిన పడకుండా ఎలాంటి యాప్స్​ మన మొబైల్​ను రక్షిస్తాయో తెలుసుకోండి.

The VPN App is protect for your Mobile from Hackers
ఆ యాప్​ మొబైల్​ ఉంటే హ్యాకర్ల నుంచి సురక్షితం

ఫోన్‌ నిత్యం చేతిలోనే ఉంటుంది.. ఇంకేంటి.. ఏదైనా వెతికేస్తాం.. ఏమైనా చూసేస్తాం.. అనుకుంటారు. మన వెబ్‌ విహారం మనకి తప్పా ఇంకెవరికి తెలుసులే అనుకుని స్వేచ్ఛగా నెట్టింట్లో తిరిగేస్తారు. కానీ, మీరు చూసే లింక్‌.. సందర్శించే సైటు.. అన్నింటినీ కావాలంటే ట్రేస్‌ చేయొచ్చు తెలుసా? అలా కాకుండా మీ నెట్టింటి గుట్టుని ఎవరికంటా పడకుండా ఉండాలంటే? అందుకు ప్రత్యేక దారులు ఉన్నాయి. అవన్నీ ప్రైవేటు దారులు. ఆ దారుల్ని ఎవరూ కనిపెట్టలేరు.. వాటినే టెక్నాలజీ పరిభాషలో ‘వీపీఎన్‌’లు అని పిలుస్తున్నారు. ఇవి యాప్‌ల రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. వాడితే మీ ఐపీ అడ్రస్‌ గుట్టుని కాపాడుతూ.. మీ నెట్టింటి సెక్యూరిటీకి రక్షణగా నిలుస్తాయి. కావాలంటే.. మీరూ ప్రయత్నించండి.

వేగంగా బ్రౌజింగ్​

హాట్‌స్పాట్‌షీల్డ్‌ యాప్‌తో రోజులో మీరు 500ఎంబీ డేటా యూసేజ్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. మరింత ఎక్కువ వీపీఎన్‌ యూసేజ్‌ అవసరమైతే ప్రీమియం సేవల్ని వాడుకోవచ్చు. వేగంగా వెబ్‌ పేజీల్ని ఓపెన్‌ చేస్తుంది. మీ పబ్లిక్‌ నెట్‌వర్క్‌ని ప్రైవేటు నెట్‌వర్క్‌లోకి తెచ్చి మీ బ్రౌజింగ్‌ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచుతుంది.

www.hotspotshield.com

10 జీబీ వరకూ ఉచితం

చాలా ఉచిత వీపీఎన్‌ సర్వీసులు రోజుకి 500ఎంబీ వరకూ ఉచిత వీపీఎన్‌ సేవలను అందిస్తాయి. తదుపరి సర్వీసులని వినియోగించుకోవాలంటే పెయిడ్‌ వర్షన్లు తీసుకోవాల్సిందే కానీ, విండ్‌స్క్రైబ్‌ మాత్రం నెలకి 10జీబీ వరకూ ఉచిత వీపీఎస్‌ సర్వీసుని అందిస్తుంది. మీరు 10జీబీ పూర్తయే వరకూ ఎన్ని రోజులైనా వాడొచ్చు. మరింత బ్రౌజ్‌ చేస్తే సొమ్ము చెల్లించాల్సిందే.

http://windscribe.com

ఆ ఓఎస్​లకు ప్రత్యేకం

వీపీఎన్‌ సేవల్లో సుపరిచితమైనదే ‘ఎక్స్‌ప్రెస్‌ వీపీఎన్‌’. మొబైల్‌ యూజర్లు సురక్షితంగా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌.. రెండింటిలోనూ పనిచేస్తుంది. మంచి ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఈ యాప్‌ ప్రత్యేకం. కట్టుదిట్టమైన ఎన్‌క్రిప్షన్‌ వలయంలో ఉండి పని చేస్తుంది.

www.expressvpn.com

వాడటం సులభం..

ఎన్‌క్రిప్షన్‌ పద్ధతిలో మీ నెట్‌వర్క్‌ని సురక్షితం చేస్తుంది ‘టన్నెల్‌బేర్‌’. యాప్‌ రూపంలో దీన్ని సులభంగా వాడొచ్చు.

మొదటి 500ఎంబీ వరకూ ఉచితంగా సర్వీసుని యాక్సెస్‌ చేయొచ్చు.

www.tunnelbear.com

నెలరోజులు..

వైపర్‌ వీపీఎన్‌ని నెల పాటు ఉచితంగా వాడుకోవచ్చు. మీకు నచ్చితే తదుపరి సేవలు వినియోగించుకునేందుకు సబ్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించాలి. ఈ యాప్‌ వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను కూడా అందిస్తుంది.

www.vyprvpn.com

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వేళ ఈ యాప్​లకు భలే ఆదరణ

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details