సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిల చెల్లింపు వ్యవహారమై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ మరిన్ని చర్యలకు సిద్ధమైంది.
బకాయిలు చెల్లించని టెలికాం కంపెనీలపై ఎలాంటి చర్యలూ ఉండవంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఇప్పటికే వెనక్కి తీసుకున్న టెలికాం శాఖ.. తాజాగా వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. శనివారం పలు టెలికాం కార్యాలయాలకు సెలవు నేపథ్యంలో సోమవారం వరకు వేచి చూసి, ఆ తర్వాత చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
మళ్లీ నోటీసులు..
తాజా బకాయి లెక్కలతో తదుపరి నోటీసులు జారీ చేయడం సహా.. లైసెన్సు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. బకాయిల చెల్లింపును గుర్తుచేస్తూ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికాం శాఖ ఇప్పటికే అయిదు నోటీసులు జారీ చేయగా.. ఇక ఎలాంటి గడువు ఇవ్వరాదని భావిస్తోంది.
ముగిసిన గడువు..
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు తమ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం అర్ధరాత్రి లోపు సర్వీస్ ప్రొవైడర్లు తమ బకాయిలు చెల్లించాలని ఆదేశించగా త్వరలోనే వాటిని చెల్లిస్తామని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించాయి.
ఇదీ చదవండి:'ఏజీఆర్ బకాయిల చెల్లిస్తాం.. కాకపోతే..'