తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్​ మార్కెట్​లో టాటా మోటర్స్ 'ఆల్ట్రోస్'... - tata_altroz_launched

హైదరాబాద్​లో టాటా మోటర్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాచ్ 'ఆల్ట్రోస్' కారును ఆ సంస్థ విడుదల చేసింది. 6 భిన్న రకాల అభిరుచులతో వాహన ప్రియులకు తగిన విధంగా ఫ్యాక్టరీ  ఫిట్టెడ్ ఆప్షన్లతో తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది.

'టాటా మోటర్స్ ప్రీమియం ఆల్ట్రోస్ విడుదల'
'టాటా మోటర్స్ ప్రీమియం ఆల్ట్రోస్ విడుదల'

By

Published : Jan 24, 2020, 4:51 PM IST

ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ 'ఆల్ట్రోస్' మోడల్ కారును హైదరాబాద్​లో విడుదల చేసింది. గ్లోబల్ ఏజెన్సీ క్రాష్ టెస్టులో సదరు కారు 5 స్టార్ రేటింగ్ సాధించినట్లు కంపెనీ తెలిపింది. వాహనం ప్రారంభ ధర పెట్రోల్ వర్షన్​కు రూ. 5.29 లక్షలు, డీజిల్ వర్షన్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు. 6 భిన్న రకాల ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఆప్షన్లతో ఈ కారు లభిస్తుంది.

బీఎస్-6 ఉద్గాగారాల ప్రకారమే...

బీఎస్-6 కార్బన్ ఉద్గారాలకు అనుగుణంగానే ఈ వాహనం తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. వాహనం లేజర్ కట్ అల్లాయ్ వీల్స్, 90 డిగ్రీల ఓపెనింగ్ డోర్స్, 2.0 ఇంపాక్ట్ ఫ్యూచరిస్టిక్ డిజైన్, ఇంటెలిజెంట్ ఇంటీరియర్స్, టచ్ స్ర్కీన్ హార్మన్ ఇన్ఫోటెయిన్​మెంట్ లాంటి ప్రత్యేకతలు కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.

'టాటా మోటర్స్ ప్రీమియం ఆల్ట్రోస్ విడుదల'

ఇవీ చూడండి : రూపాయి బలపడింది... బంగారం ధర తగ్గింది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details