బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51 తగ్గి రూ.40,688కి చేరింది. కిలో వెండి ధర రూ.472 తగ్గి రూ.47,285గా నమోదైంది.
"అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ బలపడడమే ఇందుకు కారణం."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమొడిటీస్)
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయంగానూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,555 డాలర్లుగా ఉండగా, ఔన్స్ వెండి ధర 17.80 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: పన్నుల మోత భయంతో నష్టపోయిన మార్కెట్లు