తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లపై మాంద్యం మేఘాలు- సెన్సెక్స్ 1710​ పాయింట్లు పతనం - సెన్సెక్స్ టుడే

స్టాక్​ మార్కెట్లు మరోమారు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 498 పాయింట్లు క్షీణించింది.

stocks market crisis
మళ్లీ కుదేలైన స్టాక్ మార్కెట్లు

By

Published : Mar 18, 2020, 3:42 PM IST

Updated : Mar 18, 2020, 5:01 PM IST

కరోనా భూతం మార్కెట్లను మరోమారు కుదిపేసింది. ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనా... మదుపర్లను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఉద్దీపన ప్యాకేజీలతో ప్రగతి రథానికి ఊతమిస్తామన్న వేర్వేరు దేశాల ప్రకటనల పరంపర పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపలేకపోయింది. ఫలితం... దేశీయ స్టాక్​ మార్కెట్లకు మరోమారు భారీ నష్టం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,710 పాయింట్లు కోల్పోయి 28 వేల 870 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 498 పాయింట్లు పతనమై 8 వేల 469 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా...

ఉదయం 30 వేల 969 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది సెన్సెక్స్​. ఓ దశలో 31 వేల 102 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే ఈ లాభాల జోరు ఎంతో సేపు కొనసాగలేదు.

ఆర్థిక మాంద్యం తప్పదన్న ఆందోళనలు పెరగడం మదుపర్లు అమ్మకాలకు దిగేందుకు కారణమైంది. భారత దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను ఎస్​ అండ్​ పీ రేటింగ్స్ సంస్థ తగ్గించడం మరింత ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్​ 30 వేల మార్కు దిగువకు పతనమైంది. ఓ దశలో 28 వేల 613 పాయింట్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. చివరకు మూడేళ్ల కనిష్ఠమైన 28 వేల 870 వద్ద ముగిసింది.

అత్యధిక నష్టం ఆ బ్యాంక్​దే...

ఇండస్​ఇండ్​ బ్యాంక్ అత్యధికంగా 23 శాతం క్షీణించింది. పవర్​గ్రిడ్, కోటక్ బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎన్​టీపీసీ నష్టాలు చవిచూశాయి.

ఓఎన్​జీసీ, ఐటీసీ మాత్రమే లాభపడ్డాయి.

రూపాయి... ముడిచమురు...

రూపాయి విలువ డాలరుతో పోల్చితే 12 పైసలు తగ్గి 74.36కు చేరింది.

బ్రెంట్ ముడి చమురు సూచీ 3.47శాతం క్షీణించింది. బ్యారెల్​ ధర 27.73 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:టెలికాం సంస్థలు, కేంద్రానికి సుప్రీం తీవ్ర హెచ్చరికలు

Last Updated : Mar 18, 2020, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details