ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లను పరుగులు పెట్టించాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా ఆర్థిక షేర్లు లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1016 పాయింట్లు లాభంతో 58,649 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 239 పాయింట్ల వృద్ధితో 17,470 వద్ద ముగిసింది.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో.. పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.