తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభపడిన స్టాక్​మార్కెట్లు.. రాణించిన ఎల్​&టీ, ఎస్​ బ్యాంకు

వరుస నష్టాల నుంచి స్టాక్​మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్​ 271 పాయింట్లు వృద్ధిచెంది 41 వేల 386 వద్ద ముగిసింది. నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12 వేల 179 వద్ద స్థిరపడింది.

stock market closes green
లాభాలు మూటగట్టకున్న స్టాక్​మార్కెట్లు

By

Published : Jan 23, 2020, 4:01 PM IST

Updated : Feb 18, 2020, 3:04 AM IST

అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరిగినప్పటికీ, ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్​, ఎల్​ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐలు రాణించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు లాభాలు ఆర్జించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 271 పాయింట్లు వృద్ధిచెంది 41 వేల 386 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12 వేల 179 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

లార్సెన్​ అండ్ టుబ్రో 2.98 శాతం వరకు లాభపడింది. ఎమ్​ అండ్​ ఎమ్​, ఎస్​బీఐ, టైటాన్​, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్​ రాణించాయి.

టెక్​ మహీంద్రా, పవర్​గ్రిడ్​, టీసీఎస్​, బజాజ్​ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్​, మారుతి నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ప్రాణాంతక కరోనా వైరస్​ చైనానే కాకుండా ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్ నష్టాలపాలయ్యాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 9 పైసలు క్షీణించి, ఒక డాలరుకు రూ.71.28గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 1.22 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 62.44 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఎయిర్​ బ్యాగ్​ సమస్యలతో 60 లక్షల కార్లు రీకాల్​

Last Updated : Feb 18, 2020, 3:04 AM IST

ABOUT THE AUTHOR

...view details