తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా భయాల్లోనూ బుల్​ జోరు- సెన్సెక్స్ 1,628+ - వ్యాపార వార్తలు

కరోనా భయాలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లో నేడు బుల్​ జోరు కొనసాగింది. వరుస నష్టాలకు బ్రేక్​ చెబుతూ సెన్సెక్స్ 1,628 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 482 పాయింట్లు బలపడింది.

stock markets today
స్టాక్ మర్కెట్లకు భారీ లాభాలు

By

Published : Mar 20, 2020, 3:46 PM IST

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు నేడు బ్రేక్​ పడింది. బేర్​పై బుల్​ తిరగబడి నేడు భారీ లాభాలను నమోదు చేసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,628 పాయింట్లు బలపడింది. 29,916 వద్దకు చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 30,418 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 27,932 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 482 పాయింట్ల వృద్ధితో 8,745 కి చేరింది.

కారణాలు ఇవే..

  • కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన వేళ ఆయా దేశాలు సంస్కరణలు మొదలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థలను గాడినపెట్టేందుకు భారీ ఉద్దీపనలకు సిద్ధమయ్యాయి.
  • భారత్​లోను ఆర్థిక వ్యవస్థకు ఊతమందించే చర్యలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. ఫలితంగా మదుపరులు కొత్త ఉత్సాహంతో కొనుగోళ్లపై దృష్టి సారించారు.
  • గత సెషన్​లో అమెరికా మార్కెట్లు భారీగా లాభపడటమూ మన సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.
  • హెవీ వెయిట్​ షేర్లన్నీ సానుకూలంగా స్పందించడం కూడా నేటి లాభాలకు కారణంగా చెబుతున్నారు నిపుణులు.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​యూఎల్​, రిలయన్స్, టీసీఎస్​, టాటా స్టీల్​ షేర్లు భారీగా లాభాలను నమోదు చేశాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​లు, యాక్సిస్ బ్యాంక్​ స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:అంబానీల నిర్ణయంతో రిలయన్స్ షేర్ల​ దూకుడు

ABOUT THE AUTHOR

...view details