ఆర్థిక ప్యాకేజీపై ఆశలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 1,330 పాయింట్లకుపైగా లాభంతో 29,865 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 340 పాయింట్ల వృద్ధితో.. 8,656 వద్ద ట్రేడవుతోంది.
లాభాలకు కారణాలు
కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ తీసుకురానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్నారు. ఈ సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 25 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతోంది. బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.