స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఆరంభం నుంచే సానుకూలంగా స్పందించిన సూచీలు.. చివరి వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించాయి. మ్యూచువల్ ఫండ్లకు అండగా ఆర్బీఐ ప్రకటించిన రూ.50 కోట్ల ప్యాకేజీతో మదుపరుల సెంటిమెంట్ బలపడిందని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో లభించిన కొనుగోళ్ల మద్దతే ఈ లాభాలకు కారణంగా చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు కేంద్రం కూడా భారీ ప్యాకేజీని ప్రకటిస్తుందన్న అంచనాలూ నేటి లాభాలకు మరో కారణమంటున్నారు విశ్లేషకులు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 416 పాయింట్లు బలపడి 31,743 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,282 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 32,104 పాయింట్ల అత్యధిక స్థాయి, 31,651 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 9,377 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,250 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.