తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 6:31 AM IST

ETV Bharat / business

బంపర్​ ఆఫర్..​ రుణం తీసుకుంటే వడ్డీ తగ్గింపు!

స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా నూతన సంవత్సర శుభాకాంక్షలతో అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది. గృహ రుణాల​పై వడ్డీ రేటు తగ్గించడమే.. కాకుండా మరిన్ని ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది.

SBI home loans 15 percent interest cut bumper offer
బంపర్​ ఆఫర్..​ రుణం తీసుకుంటే వడ్డీ తగ్గింపు!

నూతన సంవత్సర ప్రారంభంలో స్టేట్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది.

బంపర్​ ఆఫర్..​ రుణం తీసుకుంటే వడ్డీ తగ్గింపు!

"కొత్త ఏడాది సరికొత్తగా ప్రారంభించండి. మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. డిసెంబర్​ 31లోపు ఎస్​బీఐ హోంలోన్​ తీసుకోండి. 2020 జనవరి 1 నుంచి తక్కువ వడ్డీ ప్రయోజనం పొందండి. ఎస్​బీఐ యోనో ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే సూత్రప్రాయ ఆమోదం కూడా పొందవచ్చు."- స్టేట్​ బ్యాంకు ఆఫ్ఇండియా ట్వీట్​

నూతన సంవత్సర కానుక

ఎస్​బీఐ నూతన సంవత్సరం 2020 కానుకగా గృహరుణాలపై వడ్డీరేటు 25 శాతం తగ్గించింది. ప్రస్తుతం హోంలోన్​ వడ్డీరేటు 8.15 శాతంగా ఉంది. అయితే డిసెంబర్​ 31లోపు కనుక లోన్​ తీసుకుంటే.. జనవరి నుంచి ఈ వడ్డీ రేటు 7.9 శాతానికి తగ్గుతుంది.

ఇదీ చూడండి: 'షేర్​స్వైప్'​ పథకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్​ ప్రతిపాదన

మరిన్ని ప్రయోజనాలు

వడ్డీ రేటు తగ్గింపే కాకుండా.. ప్రాసెసింగ్ ఫీజు కూడా తగ్గించిది ఎస్​బీఐ. అలాగే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. తీసుకున్న రుణం ముందుగానే చెల్లిస్తే.. ప్రీపేమెంట్​ రుసుము కూడా వసూలు చేయమని పేర్కొంది.

పూర్తి వివరాలకోసం

ఎస్​బీఐ గృహ రుణాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్​సైట్​ http://homeloans.sbi/ చూడండి. 1800112018 టోల్​ ఫ్రీ నెంబర్​కు కాల్ చేయవచ్చు. HOME అని టైప్​ చేసి 567676కు ఎస్​ఎమ్​ఎస్​ కూడా చేయవచ్చు. ఆ తరువాత బ్యాంకు ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీ వివరాలు తెలపాల్సి ఉంటుంది.

*సూచన: సైబర్​ మోసగాళ్లు చేసే ఫేక్ కాల్స్ విషయంలో తస్మాత్త్​ జాగ్రత్త!​

ABOUT THE AUTHOR

...view details