తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్​న్యూస్.. ఎస్​బీఐ రుణాలు మరింత చౌక! - ఎస్​బీఐ వడ్డీ రేట్ల కోత

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ తమ వినియోగదారులకు గుడ్​ న్యూస్ చెప్పింది. రుణాలపై ఎంసీఎల్​ఆర్​ను 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. మే 10 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.

sbi rate cut
ఎస్​బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు

By

Published : May 7, 2020, 6:30 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ.. బెంచ్​ మార్క్​ వడ్డీ రేట్లను సవరించింది. ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 15 బేసిస్‌ పాయింట్ల కోతతో 7.25 శాతానికి తగ్గించింది. దీనినితో బెంచ్​మార్క్ వడ్డీ రేటు ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది.

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యవధిపై రూ.25 లక్షలు గృహ రుణం తీసుకున్న వారికి ఈఎంఐ సుమారు రూ.255 తగ్గనుంది. మే 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. అలాగే, మూడేళ్ల కాలవ్యవధి కలిగిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై 20 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించింది. మే 12 నుంచి ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయి.

కొత్త పథకం..

మరోవైపు సీనియర్‌ సిటిజన్ల కోసం ఎక్కువ వడ్డీని అందించే ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది. రోజురోజుకూ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పించేందుకు ‘ఎస్‌బీఐ వియ్‌ కేర్‌ డిపాజిట్‌’ పేరిట రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఐదేళ్లు, ఆపైన కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 30 బేసిస్‌ పాయింట్లు అదనంగా వడ్డీ చెల్లించనున్నారు. సెప్టెంబర్‌ 30 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి:'అన్ని రంగాలను ఆదుకునేలా కేంద్రం భారీ ప్యాకేజీ'

ABOUT THE AUTHOR

...view details