తెలంగాణ

telangana

ETV Bharat / business

అది నకిలీ వార్త‌.. నమ్మకండి: రతన్‌ టాటా - ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని రతన్ టాటా చెప్పినట్లు ఓ వార్త వైరల్​ అవుతోంది. వాటిని తీవ్రంగా ఖండించారు టాటా సంస్థల ఛైర్మన్ రతన్​ టాటా. అలాంటి ప్రకటనేది తాను చేయలేదని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు.

ratan tata
రతన్ టాటా

By

Published : Apr 11, 2020, 6:22 PM IST

కరోనా ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుందని నిపుణులు భావిస్తున్నారని తాను చెప్పినట్లుగా వస్తున్న వార్తలను ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సంస్థ ఛైర్మన్‌ రతన్‌ టాటా తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రకటనలను తాను చేయలేదని, ఇది నకిలీ వార్త అని స్పష్టం చేశారు. తాను చెప్పినట్లుగా ప్రచురితమైన కథనాన్ని జోడించి ట్వీట్‌ చేశారు.

‘‘అలా నేను చెప్పలేదు, రాయలేదు. వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో నిజమెంతో మీడియా ధ్రువీకరించాలని కోరుతున్నా. నేను ఏమైనా చెప్పాలని భావిస్తే ప్రముఖ ఛానెళ్లతో నేరుగా చెబుతా. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని, జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నా’’

-రతన్​ టాటా ట్వీట్​

వైరల్​ అవుతున్న కథనంలో ఇలా ఉంది..

''కరోనా కారణంగా భారీ స్థాయిలో ఆర్థిక పతనం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నిపుణుల గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు. కానీ మానవుల స్ఫూర్తి, శ్రమ విలువ వారికి కచ్చితంగా తెలియదని నా అభిప్రాయం'' అని రతన్‌ టాటా చెప్పినట్లు ఓ వార్తా సంస్థ ప్రచురించింది. ఈ నకిలీ వార్తపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్‌ చేశారు రతన్ టాటా.

కరోనా పోరుకు విరాళం..

కరోనా వైరస్‌ కారణంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో టాటా సంస్థ మహమ్మారిపై పోరు కోసం రూ.1500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:ఈఎంఐ వాయిదాకు సాయం ముసుగులో ఖాతాలు ఖాళీ

ABOUT THE AUTHOR

...view details