Bank Strike News: బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం ఈనెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు స్ట్రైక్ చేయాలని నిర్ణయించింది. అదనపు చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమైనంద వల్లే సమ్మెకు వెళ్తున్నామని ప్రకటించింది. సమ్మె కారణంగా చెక్ క్లియరెన్స్ సహా.. నగదు బదిలీ వంటి బ్యాంకింగ్ కార్యకలాపాలపై సమ్మె ప్రభావం ఉంటుందని కస్టమర్లను హెచ్చరించాయి బ్యాంకులు.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను ప్రైవేటీకిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు పేర్కొంది యూఎఫ్‌బీయూ.