ఇటీవలే రికార్డు స్థాయిలో పతనమైన ముడి చమురు ధరలు.. నేడు అంతే వేగంగా పుంజుకున్నాయి. ప్రస్తుత డిమాండుకు తగ్గట్లు చమురు ఉత్పత్తిని తగ్గించి.. మద్దతు ధర కల్పించేందుకు సౌదీ అరేబియా, రష్యాలు చర్చలు జరుపుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.
నార్త్ సీలో బ్యారెల్ ముడిచమురు ధర 30శాతం వృద్ధితో 36.29 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ కూడా 25.4శాతం మెరుగుపడి 27.39 డాలర్లకు పెరిగింది.
పెరిగింది కానీ...
ట్రంప్ ట్వీట్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి మాత్రం.. సౌదీ యువరాజుతో ఎలాంటి సంభాషణలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే దీని ప్రభావం చమురు ధరలపై పడే అవకాశముంది.
అనూహ్య నిర్ణయం..