తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫోన్ లేకున్నా వాట్సాప్ వెబ్... అతి త్వరలో!

వాట్సాప్​ త్వరలోనే యూడబ్ల్యూపీ ఫీచర్​ ద్వారా ఫోన్ లేకుండానే ల్యాప్​టాప్​, పీసీల్లో వాట్సాప్ వెబ్​ సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తోందని ఓ వెబ్​సైట్ పేర్కొంది. మరో మెసేంజిగ్ యాప్ టెలిగ్రామ్​లో ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది.

ఫోన్ లేకున్నా వాట్సాప్ వెబ్... అతి త్వరలో!

By

Published : Jul 30, 2019, 12:42 PM IST

ఫోన్ లేకున్నా వాట్సాప్​ వెబ్​ వాడొచ్చా? ఎలా సాధ్యం అనుకుంటున్నారా? త్వరలోనే దాన్ని సాకారం చేయడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.
వినియోగదారులకు మరింత సౌలభ్యం చేకూర్చడానికి వాట్సాప్​ వెబ్​ను 2015లో పరిచయం చేసింది మాతృసంస్థ ఫేస్​బుక్​. అయితే ఫోన్ దగ్గర లేకుండా ల్యాప్​టాప్​, పీసీల్లో వాట్సాప్​ వెబ్​ను వాడలేని పరిస్థితి.

టెలిగ్రాం ముందంజ..

వాట్సాప్​ పోటీ సంస్థ టెలిగ్రాం ఇప్పటికే 'యూడబ్ల్యూపీ ఫీచర్​​' ద్వారా తన వినియోగదారులకు ఫోన్​ లేకుండానే టెలిగ్రాం వెబ్​ వాడుకునే సౌలభ్యం కల్పించింది.

కొత్త ముచ్చట...

'వాట్సాప్​ తన వినియోగదారులకూ ఈ సౌలభ్యం కల్పించడానికి నడుంబిగించింది. మైక్రోసాఫ్ట్​ అభివృద్ధి చేసిన యూనివర్సల్ విండోస్​ ప్లాట్​ఫాం ద్వారా వాట్సాప్​ వెబ్​ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది' అని డబ్ల్యూఏ బీటెల్​ ఇన్ఫో వెబ్​సైట్​ పేర్కొంది.

యూడబ్ల్యూపీ యాప్​, అలాగే వాట్సాప్​ అభివృద్ధి చేస్తున్న మల్టీ ప్లాట్​ఫాం సిస్టమ్​ ద్వారా వినియోగదారులు ఫోన్​ లేకుండానే డెస్క్​టాప్​లో వాట్సాప్​ వాడడానికి వీలవుతుంది. ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయినప్పుడు, ఫోన్ దగ్గర లేనప్పుడు ఈ ఫీచర్​ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ వార్తకు కచ్చితమైన ఆధారాలు లేవని చెప్పింది ఈ టెక్​ వెబ్​సైట్.

మరిన్ని ఫీచర్​లు

వాట్సాప్​.... మరిన్ని నూతన ఫీచర్​లను అందుబాటులోకి తేనుంది. ఇటీవలే పిక్చర్​ ఇన్ పిక్చర్ ఫీచర్ తీసుకొచ్చింది. యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్ వీడియోలు వాట్సాప్​లోనే చూసుకునే వెసులుబాటునూ కల్పించింది. త్వరలోనే డార్క్ మోడ్​ను, ప్రైవసీ కంట్రోల్​ను ప్రవేశపెట్టబోతోంది.

ఇదీ చూడండి: వాణిజ్య చర్చల సఫలంపై ఆశలతో లాభాలు

ABOUT THE AUTHOR

...view details