తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆటో'పై కరోనా దెబ్బ- ఏప్రిల్​లో విక్రయాలు జీరో - ఏప్రిల్​లో నిలిచిన ఆటోమొబైల్ విక్రయాలు

దేశవ్యాప్త లాక్​డౌన్​తో ఏప్రిల్ నెలలో దేశీయంగా ఒక్క వాహనం కూడా విక్రయించలేదని మారుతీ సుజుకీ, ఎంజీ మోటర్స్​ ప్రకటించాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఉత్పత్తి కూడా నిలిచిపోయినట్లు మారుతి వెల్లడించింది.

zero auto sales in april
ఏప్రిల్​లో స్తంభించిన వాహన విక్రయాలు

By

Published : May 1, 2020, 12:31 PM IST

దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్ నెలలో దేశీయంగా ఒక్క యూనిట్​ కూడా విక్రయించలేదని ప్రకటించింది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​తో అమ్మకాలు నిలిచిపోయినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారాల్లో ఉత్పత్తి కూడా ఆగిపోయినట్లు వెల్లడించింది.

అయితే గత నెలలో 632 యూనిట్లను మాత్రం ముంద్రా పోర్ట్ ద్వారా ఎగుమతి చేసినట్లు మారుతి తెలిపింది. భద్రతాపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగానే వాటిని ఎగుమతి చేసినట్లు స్పష్టం చేసింది.

ఎంజీ మోటార్స్​ విక్రయాలు అంతే...

మరో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటర్స్ కూడా ఏప్రిల్​లో ఒక్క యూనిట్​ కూడా విక్రయించలేదని ప్రకటించింది. లాక్​డౌన్ కారణంగా విక్రయ కేంద్రాలన్నీ మూతపడినట్లు వెల్లడించింది.

అయితే గుజరాత్​లోని హలాల్​లో ఉన్న సంస్థ కర్మాగారంలో గత నెల చివరి వారం నుంచి తక్కువ సామర్థ్యంలో ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది ఎంజీ మోటర్స్. మే నెలలో ఉత్పత్తి పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు శానిటైజేషన్, భౌతిక దూరం సహా అన్ని రకాల రక్షణ చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపింది ఎంజీ మోటర్స్.

ఇదీ చూడండి:యాపిల్, అమెజాన్​ లాభాలకు కరోనా గండి

ABOUT THE AUTHOR

...view details