లివైజ్ షేర్లకూ డిమాండ్ ఎక్కువే లివైజ్ జీన్స్ అంటే తెలియని కుర్రకారు ఉండరు. అమెరికావాసులకు తొలిసారి జీన్స్లను పరిచయం చేసింది ఈ సంస్థే. పెట్టుబడుల సేకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
స్టాక్ మార్కెట్లో "లివి" అనే పేరుతో గురువారం ఆ సంస్థ ట్రేడింగ్ ప్రారంభించింది. లివైజ్ షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. 17 డాలర్లు వద్ద ప్రారంభమైన షేరు ధర భారీ డిమాండ్ కారణంగా 5.90 డాలర్లు పెరిగి 22.90 డాలర్ల వరకు అమ్మకాలు జరిగాయి. అంటే షేరు విలువ 31 శాతం పెరిగింది.
గురువారం రాత్రి నాటికి షేరు ధరల్లో పెరుగుదల దాదాపు 33 శాతానికి చేరుకుంది.
లివైజ్ ప్లబిక్ ఇష్యూని పురస్కరించుకుని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పటి వరకు అమల్లో ఉన్న " నో జీన్స్" విధానాన్ని రద్దు చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఉద్యోగులు సూటూ,బూటు నుంచి జీన్స్లోకి మారారు.
లివైజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిప్ బెర్గ్ సహా ఇతర దేశాల్లోని సంస్థ కార్యాలయాల నుంచి 120 మంది ఉద్యోగులు ట్రేడింగ్ నిర్వహించారు.
166 సంవత్సరాల చరిత్ర కలిగిన లివైజ్ 1971 సంవత్సరంలో తొలిసారి పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.