తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీసీ కొత్త ఛైర్మన్​, ఎండీగా సంజీవ్​ పురి

దేశీయ కార్పొరేట్​ దిగ్గజం ఐటీసీ సంస్థకు నూతన ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​గా సంజీవ్​ పురి నియమితులయ్యారు. వైసీ దేవేశ్వర్​ మరణంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కంపెనీ భారీ లాభాలు ప్రకటించింది.

ఐటీసీ కొత్త ఛైర్మన్​, ఎండీగా సంజీవ్​ పురి

By

Published : May 13, 2019, 4:26 PM IST

ఎమ్​ఎఫ్​సీజీ వ్యాపార దిగ్గజ సంస్థ ఐటీసీ.. కొత్త ఛైర్మన్​ను నియమించింది. ఆ కంపెనీకి మేనేజింగ్​ డైరెక్టర్​గా కొనసాగుతున్న సంజీవ్​ పురికి ఛైర్మన్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

సుదీర్ఘకాలం ఐటీసీకి సేవలందించిన వైసీ దేవేశ్వర్​ ఆకస్మిక మరణంతో ఛైర్మన్​ నియాకమం అనివార్యమైంది. 2017లో సీఈఓ పదవి నుంచి వైదొలిగినప్పటికీ... తుదిశ్వాస విడిచే వరకు ఆయన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదాలోనే ఉన్నారు. సంజీవ్​ పురి నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గానికి దేవేశ్వర్​ సలహాదారుగా పనిచేశారు.

ఈ రోజు బోర్డు సమావేశంలో సంజీవ్​ పురిని ఛైర్మన్​గా నియమిస్తున్నట్లు ప్రకటించింది ఐటీసీ. 2019 మే 13 నుంచే నిర్ణయం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఆయన పదవిని ఛైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​(సీఎండీ)గా పేర్కొంది.

ఛైర్మన్​, సీఈఓలకు సమన్వయకర్తగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​​ పదవిని 2017 నుంచి తీసుకొచ్చింది ఐటీసీ.

భారీ లాభాల ప్రకటన...

కొత్త సీఎండీని నియమించిన అనంతరం.. నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను ప్రకటించింది ఐటీసీ. 2019 మార్చి 31తో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ. 3481.9 కోట్లుగా ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 2, 932. 71 కోట్లతో పోలిస్తే ఇది 18.72 శాతం అధికం.

ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 14.26 శాతం పెరిగి.. రూ. 12, 946. 21 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 11, 329. 74 కోట్లు.

ఇదీ చూడండి:

ఐఏఎస్​, ఐపీఎస్​ల కేడర్​ వివాదంపై 17న విచారణ

ABOUT THE AUTHOR

...view details