తెలంగాణ

telangana

ETV Bharat / business

మేధో సంపత్తి సూచీలో 40వ స్థానంలో  భారత్​

అంతర్జాతీయ మేధో సంపత్తి జాబితాలో భారత్ 40వ స్థానంలో నిలిచింది. 2019తో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారినప్పటికీ.. 6.71 శాతం స్కోరు పెరిగినట్లు గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్​ తన నివేదికలో తెలిపింది. మరోవైపు బాలీవుడ్​లో కాపీరైట్ల ఉల్లంఘన అధికంగా జరుగుతున్నట్లు వెల్లడించింది.

By

Published : Feb 6, 2020, 5:51 AM IST

Updated : Feb 29, 2020, 8:52 AM IST

India ranks 40 out of 53 countries on global intellectual property index
మేధో సంపత్తి సూచీలో భారత్​కు 40వ స్థానం

అంతర్జాతీయ మేధో సంపత్తి(ఐపీ) సూచీలో 40వ స్థానంలో నిలిచింది భారత్​. మేధో సంపత్తి పరిరక్షణ, కాపీరైట్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ ఏడాది నాలుగు స్థానాలు దిగజారినట్లు గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్(జీఐపీసీ) నివేదించింది.

మెరుగైన భారత్​..!

మొత్తం 53 దేశాల జాబితాలో భారత్​ 40వ స్థానానికి పరిమితమయ్యింది. గతేడాది.. 2019లో 50 దేశాల జాబితాలో 36వ స్థానంలో నిలిచింది భారత్​. అయితే గతేడాదితో పోలిస్తే భారత్​ స్కోరు 6.71 శాతం మేర మెరుగుపడింది. 2019లో 36.04 శాతం(45 పాయింట్లకు గానూ 16.22) మార్కులు సాధించగా... ఈ ఏడాది స్కోరు 38.46(50కి 19.23 పాయింట్లు) శాతానికి చేరుకున్నట్లు జీఐపీసీ తన నివేదికలో స్పష్టం చేసింది.

"2016లో జాతీయ ఐపీఆర్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి మేధో హక్కుల పరిరక్షణ కోసం వినూత్న ఆవిష్కరణలు, సృజనాత్మకతల పెట్టుబడులపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది."
-జీఐపీసీ

ఈ జాబితాలోకి కొత్తగా వచ్చిన గ్రీస్, డామినికన్ రిపబ్లిక్​ దేశాలు భారత్​ కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ దేశాలు భారత్​ను అధిగమించాయి.

బలపడిన ఐపీ వ్యవస్థ

2016 నుంచి భారత్​లో పేటెంట్లు, ట్రేడ్​మార్క్​ దరఖాస్తుల ప్రాసెసింగ్​ సమయం గణనీయంగా తగ్గినట్లు జీఐపీసీ పేర్కొంది. దేశంలోని ఆవిష్కరణ కర్తలకు ఐపీ హక్కులపై అవగాహన పెంపొందించిందని తెలిపింది. గత సంవత్సరంలో భారత మేధో సంపత్తి వ్యవస్థ బలపడిందని స్పష్టం చేసింది. మరోవైపు ఐపీ ఇండెక్స్​ స్కోర్ ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది.

"కాపీరైట్ ఉల్లంఘించే కంటెంట్​ను యాక్సెస్ చేయడానికి దిల్లీ హైకోర్టు 2019లో నిషేధం విధించింది. దీంతో కాపీరైట్ సంబంధిత సూచీలో భారత్ స్థానం మెరుగైంది. ఈ నిషేధాల కారణంగా యుకే, సింగపూర్ వంటి దేశాల సరసన భారత్ చేరింది. ఫలితంగా కాపీరైట్ సూచీలో 24 దేశాలకన్నా ముందు వరుసలో నిలిచింది."-జీపీఐసీ

బాలీవుడ్​లో పైరసీ

బాలీవుడ్​లో కాపీరైట్​ హక్కుల ఉల్లంఘన అన్ని రంగాల్లోకెల్లా అత్యధికమని తెలిపింది జీపీఐసీ. పైరసీ కారణంగా బాలీవుడ్ 3 బిలియన్ అమెరికన్​ డాలర్లు నష్టపోతోందని వెల్లడించింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలను విజయవంతం చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు పేటెంట్ సామర్థ్యం, ​​పేటెంట్ అమలు, తప్పనిసరి లైసెన్సింగ్, పేటెంట్ వ్యతిరేకత వంటి సవాళ్లు భారత్​కు పొంచి ఉన్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: నేడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 10 మందికే చోటు

Last Updated : Feb 29, 2020, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details